Refrigerator Food: మీకు తెలుసా.. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారాలు మళ్లీ వేడిచేసి తింటే క్యాన్సర్‌ ప్రమాదం..

|

Sep 13, 2023 | 9:43 PM

నేటి లైఫ్ స్టైల్, బిజీ లైఫ్‌ కారణంగా డైట్ కూడా చాలా మారిపోయింది. పని ఒత్తిడి కారణంగా రోజు వండుకుని తినే పరిస్థితిలేదు. దీంతో మార్కెట్‌లో దొరికే క్యాన్‌ ఫుడ్‌ తింటుంటారు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీంతో సమయం దొరికినప్పుడు వండుకుని తింటుంటారు. ఇక రాత్రి మిగిలి పోయిన అన్నం, కూరలు వంటి వాటిని ఫ్రిజ్‌లో భద్ర పరచడం మనందరం చేసే పనే. ఇలా భద్రపరచిన ఆహారాన్ని మరుసటి రోజు కాస్త వేడి చేసుకుని తింటుంటారు. ఐతే ఫ్రిజ్‌లో నిల్వ..

Refrigerator Food: మీకు తెలుసా.. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారాలు మళ్లీ వేడిచేసి తింటే క్యాన్సర్‌ ప్రమాదం..
Refrigerator Food
Follow us on

నేటి లైఫ్ స్టైల్, బిజీ లైఫ్‌ కారణంగా డైట్ కూడా చాలా మారిపోయింది. పని ఒత్తిడి కారణంగా రోజు వండుకుని తినే పరిస్థితిలేదు. చాలా మంది మార్కెట్‌లో దొరికే క్యాన్‌ ఫుడ్‌ తింటుంటారు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీంతో సమయం దొరికినప్పుడు వండుకుని తింటుంటారు. ఇక రాత్రి మిగిలి పోయిన అన్నం, కూరలు వంటి వాటిని ఫ్రిజ్‌లో భద్ర పరచడం మనందరం చేసే పనే. ఇలా భద్రపరచిన ఆహారాన్ని మరుసటి రోజు కాస్త వేడి చేసుకుని తింటుంటారు. ఐతే ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారాన్ని మళ్లీ వేడిచేసుకుని తినడం వల్ల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని మీకు తెలుసా..?

రిఫ్రిజిరేటెడ్ ఆహారాన్ని పదేపదే వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం కావడమే కాకుండా, శరీరంలో వివిధ సమస్యలకు కారణం అవుతుంది. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, సమతుల్య దినచర్య, మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. కానీ చాలాసార్లు మనం చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పెద్ద సమస్యలను కొని తెచ్చుకుంటుంటాం. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం, పదేపదే వేడి చేయడం అంత మంచి పద్ధతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫ్రిజ్‌లో ఉంచి తిరిగి వేడి చేసి తినకూడని ఆహారాలు ఇవే..

మాంసాహారం

చేపలు, మాంసం వంటి నాన్‌ వెజ్‌ ఆహారాలను ఒక సారి వండిన తర్వాత ఫ్రిజ్‌లో దాచుకుని రెండు మూడు రోజులు తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. చేపలు, మాంసాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసి, తిరిగి వేడి చేసి తినడం వల్ల అది విషంగా మారుతుంది. ఇది శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

ఇవి కూడా చదవండి

అన్నం

మన దేశంలో అధికంగా తినే ఆహారాలలో అన్నం ఒకటి. చాలా మంది మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్‌లో ఉంచుతారు. దానిని ఉదయం వేడి చేసుకుని తింటారు. చాలా మంది మిగిలిపోయిన అన్నంతో రకరకాల వంటకాలు కూడా తయారు చేస్తుంటారు. ఒక అధ్యయనం ప్రకారం.. చద్ది అన్నం వేడి చేసి తినడం వల్ల టాక్సిక్‌ ఫుడ్‌గా మారుతుందట.

గుడ్లు

గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు.గుడ్డు ఆమ్లెట్, ఉడికించిన గుడ్లు, గుడ్డు కూర వంటి వంటకాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డుతో తయారు చేసిన వంటకాలను వెంటనే తినడం మంచిది. దీనిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత మళ్లీ వేడి చేసుకుని తినకూడదు. ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

గ్రీన్ వెజిటబుల్స్

గ్రీన్ వెజిటేబుల్స్‌లో న్యూట్రీషియన్స్‌ అధికంగా ఉంటాయి. పచ్చ కూరగాయల్లో నైట్రేట్లు ఉంటాయి. అందువల్ల వీటిని పదే పదే వేడిచేసినప్పుడు క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆకు కూరలు వంటి గ్రీన్ వెజిటబుల్స్‌ను వేడి చేసి తినకపోవడం మంచిది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.