Pulipiri Removal Tips: పులిపిర్లతో చిరాకు వస్తుందా.. వాటికి ఇలా చెక్ పెట్టండి!

|

Feb 13, 2024 | 5:19 PM

ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో పులిపిర్లు కూడా ఒకటి. ఇవి ముఖం, కాళ్లు, చేతులు, మెడ, వీపు లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా వస్తాయి. వీటి వల్ల శరీరానికి ఎలాంటి హాని, నొప్పి ఉండదు. కానీ చూడటానికి మాత్రం చిరాకుగా అనిపిస్తాయి. కొంత మందికి ఇవి ఎక్కువగా ఫేస్ మీద వస్తాయి. అవి అలానే పెద్దవిగా మారిపోతాయి. దీంతో ముఖం అంద విహీనంగా మారిపోతున్నాయి. కాబట్టి చాలా మంది వీటి నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్లో‌ లభ్యమయ్యే ఖరీదైన..

Pulipiri Removal Tips: పులిపిర్లతో చిరాకు వస్తుందా.. వాటికి ఇలా చెక్ పెట్టండి!
Pulipiri
Follow us on

ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో పులిపిర్లు కూడా ఒకటి. ఇవి ముఖం, కాళ్లు, చేతులు, మెడ, వీపు లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా వస్తాయి. వీటి వల్ల శరీరానికి ఎలాంటి హాని, నొప్పి ఉండదు. కానీ చూడటానికి మాత్రం చిరాకుగా అనిపిస్తాయి. కొంత మందికి ఇవి ఎక్కువగా ఫేస్ మీద వస్తాయి. అవి అలానే పెద్దవిగా మారిపోతాయి. దీంతో ముఖం అంద విహీనంగా మారిపోతున్నాయి. కాబట్టి చాలా మంది వీటి నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్లో‌ లభ్యమయ్యే ఖరీదైన ప్రాడెక్ట్స్‌ని ఉపయోగిస్తున్నారు. కానీ వీటితో లాభాలు కంటే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ. అయితే పులిపిర్లను ఇంటి చిట్కాలు ఉపయోగించి కూడా చెక్ పెట్టొచ్చు. వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి పేస్ట్:

వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వివిధ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు వెల్లుల్లిని ఉపయోగించే వారు. అలాగే వెల్లుల్లితో చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అందులోనే పులిపిర్లు కూడా తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను మిశ్రమంలా తయారు చేసుకుని.. పులిపిర్లపై ఓ 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా చేస్తే సులభంగా పులిపిర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్‌లో కూడా చర్మానికి కావాల్సిన ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అలోవెరా జెల్‌తో అనేక చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అదే విధంగా పులిపిర్లు ఉన్న వారు కూడా అలోవెర జెల్‌ను తీసి వాటిపై అప్లై చేయాలి. ఈ రెమిడీని రోజుకు మూడు నుంచి నాలుగు రోజుల పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా పులిపిర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాతో కూడా పులిపిర్లను తగ్గించుకోవచ్చు. పులిపిర్లను తగ్గించడంలో బేకింగ్ సోడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. కొద్దిగా ఆముదం నూనెలో బేకింగ్ సోడా కలిపి.. పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:

పులిపిర్లను తగ్గించుకోవడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఉపయోగపడుతుంది. కాటన్ బాల్ సహాయంతో యాపిల్ సైడర్ వెనిగర్‌ను పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.