AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radish: ముల్లంగితో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే బిత్తరపోవాల్సిందే..

ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచివి. ముల్లంగిని సలాడ్ రూపంలో గానీ లేదా సాధారణంగా...

Radish: ముల్లంగితో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే బిత్తరపోవాల్సిందే..
Radish
Ravi Kiran
|

Updated on: Apr 13, 2022 | 9:57 AM

Share

ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచివి. ముల్లంగిని సలాడ్ రూపంలో గానీ లేదా సాధారణంగా తిన్నా కూడా శరీరానికి చక్కటి ప్రయోజనాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిన ముల్లంగి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు జలుబు, దగ్గు, నోటి సమస్యలు.. ఉదరం, మూత్రపిండాలు, డయాబెటిస్ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ముల్లంగిని సరైన సమయానికి, సరైన పద్దతిలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. లేదంటే గ్యాస్ సమస్య, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. ఒకసారి అవేంటో పరిశీలిద్దాం..

ముల్లంగి తినడానికి సరైన సమయం.. నిద్రలేవగానే ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగిని తినకూడదు. అల్పాహారం తర్వాత గానీ.. భోజనానికి ముందుగానీ ముల్లంగిని తీసుకోవాలి. అలాగే సాయంత్రం వేళ సలాడ్‌గా ముల్లంగిని తినొచ్చు. ఇలా తినడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అయితే చాలామంది మధ్యాహ్న భోజనంలో ముల్లంగిని తింటుంటారు. ఆయుర్వేదం ప్రకారం.. వండిన ఆహారంలో పచ్చి కూరగాయలు కలపకూడదు. ఒకవేళ కలిపితే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ముల్లంగిని ఎలా తినొచ్చు.. ముల్లంగిని సలాడ్‌గా తినడం ఉత్తమ మార్గం. మీరు ముల్లంగితో పాటు టమోటా, క్యారెట్, దోసకాయ, ఉల్లిపాయ మొదలైన ఇతర పచ్చి కూరగాయలను సలాడ్‌గా తీసుకోవచ్చు. ఇలా తినడం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. సన్నగా ఉన్న చిన్న ముల్లంగిని తినండి. చాలా రుచిగా, తీపిగా ఉంటాయి. ముల్లంగిని తినే ముందు శుభ్రంగా కడిగి.. వాటి తొక్క తీయండి. నల్ల ఉప్పుతో కలిపి ముల్లంగిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ముల్లంగి తిన్న తర్వాత కొంతసేపు నడవండి. గ్యాస్, అసిడిటీ మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ వ్యక్తులు ముల్లంగి తినడం మానుకోవాలి.. మీకు బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే.. మీ శరీరానికి ఎక్కువ శ్రమ పెట్టలేరు. కాబట్టి ఆ సమయంలో ముల్లంగికి దూరంగా ఉండండి. అంతేకాకుండా రాత్రిపూట ముల్లంగిని ఏ రూపంలోనూ తినకూడదు. దీని వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.

ముల్లంగితో ఇవి తినకూడదు… మరోవైపు ఈ నాలుగు ఆహార పదార్ధాలతో ముల్లంగిని తింటే విషంతో సమానం. ముల్లంగి-నారింజ, ముల్లంగి-కీరదోస, ముల్లంగి-కాకరకాయ, ముల్లంగి-పాలు.. ఇవి కలిపి తినకూడదు. కనీసం 10 గంటల నుంచి 24 గంటల గ్యాప్ ఉండాలి.

గమనిక:- ఈ సమాచారం కేవలం నిపుణుల సూచనలు, ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవికరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోండి.