రాత్రిపూట ఇలా చేస్తే ముడతలు తగ్గి అందం రెట్టింపు..ఇది పక్కా..!

వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు సహజం. కానీ, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసువారిని కూడా ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. చర్మంలో కొల్లాజెన్‌ అనే ప్రోటీన్‌ ఉంటుంది. పోషకాహార లోపం, ఒత్తిడి, కాలుష్యం కారణంగా కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గి ముఖంపై ముడతలు ఏర్పడతాయి. దీంతో వయసు కంటే ముందుగానే ముఖంలో ముడతలు, మచ్చలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. అయితే, మంచి పోషకాహారం తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అవేంటో చూద్దాం!

రాత్రిపూట ఇలా చేస్తే ముడతలు తగ్గి అందం రెట్టింపు..ఇది పక్కా..!
Premature Wrinkles

Updated on: Nov 09, 2025 | 1:36 PM

రాత్రిపూట పడుకునే ముందు మేకప్‌ తొలగించండి. మేకప్‌ చర్మ రంధ్రాలు మూసి వేస్తుంది. దీని వల్ల అందం పాడవుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడే అవకాశం ఉంటుంది. అందుకే, రాత్రిపూట పడకునే ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రంగా వాష్‌ చేసుకోండి. డబుల్ క్లెన్సింగ్‌ చేయడం వల్ల మేకప్‌, సన్‌స్క్రీన్‌ తొలిగిపోతుంది. దీంతో రాత్రిపూట చర్మానికి బాగా గాలి తగులుతుంది. ముడతలు తగ్గుతాయి. క్లెన్సింగ్‌ తర్వాత టోనర్‌ అప్లై చేయండి.

ముఖానికి టోనర్‌ చర్మం తాలూక పీహెచ్‌ విలువను స్థిరంగా ఉంచుతుంది. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. ముడతలు మాయం అవుతాయి. నైట్‌క్రీమ్‌ రాసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. పగుళ్లు తగ్గుతాయి. మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ముడతలు కూడా తగ్గుతాయి. రాత్రిపూట రెటినోల్ ఉత్పత్తులు ఉపయోగించండి. ఇవి కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మాన్ని రిపేర్ చేస్తాయి. ముడతల్ని తగ్గిస్తాయి.

రాత్రిపూట ఐ క్రీమ్‌ రాసుకోండి. ఇది కంటి కింద చర్మాన్ని అందంగా, ఆరోగ్యవంతంగా మార్చుతుంది. ఐ క్రీమ్‌ వల్ల ఫైన్‌లైన్స్‌ తగ్గుతాయి. ముఖం మీద ముడతలు రావడానికి సరైన భంగిమలో నిద్రపోవడం చాలా అవసరం. దిండుకు ముఖాన్ని ఉంచి పడుకోవడం వల్ల స్లీప్‌ లైన్స్‌ వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట పడుకోవడానికి ఉపయోగించే దిండుకు సిల్క్‌ పిల్లో కవర్‌ వాడండి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. నిద్రలేమి పలు సమస్యలకు కారణం అవుతుంది. నిద్రలేమి వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. ముడతలు వస్తాయి. కాబట్టి 8 గంటల పాటు నిద్రపోండి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..