AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Probiotics vs Prebiotics: ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి? పేగు ఆరోగ్యానికి ఏది ముఖ్యం? ఏ ఆహారంలో ఇవి ఉంటాయంటే..

కడుపుని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రీబయోటిక్స్ , ప్రోబయోటిక్స్ రెండూ కావాలి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ప్రీబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమైన ఆహారంలో లభిస్తాయి. అంటే వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటిపండు వంటి ఆహారంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచే ప్రత్యక్ష బ్యాక్టీరియా. ఇవి పెరుగు, మజ్జిగ, ఊరగాయ వంటివాటిల్లో లభిస్తాయి.

Probiotics vs Prebiotics: ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి? పేగు ఆరోగ్యానికి ఏది ముఖ్యం? ఏ ఆహారంలో ఇవి ఉంటాయంటే..
Probiotics Vs Prebiotics
Surya Kala
|

Updated on: May 12, 2025 | 11:08 AM

Share

ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం పేగు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రోబయోటిక్స్ నిజానికి జీర్ణవ్యవస్థలో కనిపించే .. జీర్ణక్రియను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా శరీరంలో ఇప్పటికే ఉంటుంది. అయితే పెరుగు, మజ్జిగ, కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాల ద్వారా కూడా వీటిని పెంచవచ్చు. ప్రోబయోటిక్స్ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. కడుపు సంబంధిత అనేక సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి.

మరోవైపు ప్రీబయోటిక్స్ అనేది జీర్ణం కాని ఆహార పదార్ధాలు. ఇవి ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను కార్యాచరణను ప్రేరేపిస్తాయ. ప్రీబయోటిక్స్ చాలా పండ్లు, కూరగాయలు, అరటిపండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు .ఓట్స్ వంటి తృణధాన్యాలలో కనిపిస్తాయి. కనుక ఆరోగ్యకరమైన పేగు కోసం, ప్రీబయోటిక్స్ , ప్రోబయోటిక్స్ రెండింటినీ కలిపి తీసుకోవడం అవసరం.

ప్రీబయోటిక్స్ అంటే ఏమిటి?

ప్రీబయోటిక్స్ అనేవి జీర్ణం కాని ఆహార భాపదార్ధాలు. వీటిని మన శరీరం స్వయంగా జీర్ణించుకోదు. అయితే అవి మన ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల గట్ మైక్రోబయోటాకు శక్తి లభిస్తుంది. అవి ఆరోగ్యకరమైన రీతిలో పెరగడానికి వీలు కల్పిస్తుంది. సాధారణంగా ఇవి ఇనులిన్, ఫ్రక్టోలిగోసాకరైడ్లు మొదలైన ఫైబర్స్, ఇవి ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఓట్స్, ఆకుకూరలలో కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి?

ప్రోబయోటిక్స్ అనేవి నిజానికి సజీవ బ్యాక్టీరియా. వీటిని సరైన పరిమాణంలో తీసుకుంటే మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ బ్యాక్టీరియా మన ప్రేగులలోకి వెళ్లి అక్కడ సహజ సమతుల్యతను కాపాడుతుంది. మన పేగు సమతుల్యత చెదిరినప్పుడు.. యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత ప్రోబయోటిక్స్ దానిని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. ఇవి పెరుగు, మజ్జిగ, కిమ్చి, కేఫీర్, ఊరగాయలు, కొన్ని సప్లిమెంట్లలో కనిపిస్తాయి.

రెండింటి మధ్య తేడా ఏమిటి?

ప్రీబయోటిక్స్ .. ప్రోబయోటిక్స్ రెండూ మన జీర్ణవ్యవస్థకు ముఖ్యమైనవి. అయితే వీటి పాత్రలు భిన్నంగా ఉంటాయి. ప్రీబయోటిక్స్ బ్యాక్టీరియాకు ఆహారం అయితే. ప్రోబయోటిక్స్ కూడా బ్యాక్టీరియాలే. ఒక విధంగా ప్రీబయోటిక్స్ ఎరువులు.. ప్రోబయోటిక్స్ మొక్కలు గా పరిగణించవచ్చు. రెండూ కలిసి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఈ రెండూ ఎందుకు ముఖ్యమైనవి?

ఆరోగ్యకరమైన పేగు జీర్ణక్రియను మాత్రమే కాదు రోగనిరోధక వ్యవస్థ, మానసిక స్థితి, జీవక్రియను కూడా నియంత్రిస్తుంది. పేగులో మంచి బ్యాక్టీరియా లేకపోతే లేదా వాటికి సరైన పోషకాహారం అందకపోతే, వాపు, మలబద్ధకం, ఆమ్లత్వం, నిరాశ వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు. అందువల్ల ప్రీబయోటిక్స్ , ప్రోబయోటిక్స్ రెండింటి సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.

వీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?

రోజువారీ ఆహారంలో ప్రీబయోటిక్ , ప్రోబయోటిక్ ఆహారాలను జోడించడం సులభమైన, ప్రభావవంతమైన మార్గం. ఉదయం పెరుగుతో అరటిపండు తినడం మంచి కలయిక. అలాగే తినే ఆహారంలో ఓట్స్, ఉల్లిపాయ, వెల్లుల్లి , పులియబెట్టిన ఆహారాలను చేర్చుకోండి. ఈ ఆహారం తినడానికి వీలు కాకపోతే వైద్యుడి సలహా మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. కనుక పులియబెట్టిన లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కొంతమందికి సరిపోవు. కనుక వీటిని తిన్న మొదట్లో కొంత గ్యాస్ లేదా ఉబ్బరం అనిపించవచ్చు. అయితే ఈ సమస్య కొంత సమయం తర్వాత తగ్గిపోతుంది. ఒకవేళ ఈలక్షణాలు పెరిగితే వైద్యుడి సలహా తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)