Coriander Benefits: కొత్తిమీర కాడలు షుగర్ పేషెంట్స్ కు ఓ వరం.. ఎలా ఉపయోగించాలంటే..
భారతీయ వంటల్లో కొత్తిమీర, కరివేపకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. ఇవి ఆహారంలో రుచిని పెంచుతాయని , సువాసన్ని ఇస్తాయని నమ్మకం. అయితే కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది కొత్తిమీర ఆకులను తిని.. వాటి కాడలను పడేస్తారు. ఇలా చేయడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర కాడల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

కొత్తిమీర లేని వంట ఉండదు అంటే అతిశయోక్తి కాదు. రోజూ కొత్తిమీరను వంటల్లో వేయడం వలన రుచి పెరుగుతుంది. అయితే ఈ కొత్తిమీరను గార్నిష్ కోసం మాత్రమే కాదు.. చట్నీ, సూప్ వంటి వాటిల్లో కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే పాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్ ఎ, బి, సి, కెలు ఉన్నాయి. అయితే చాలా మంది కొత్తిమీర ఆకులను తిని వాటి కాడలను పడేస్తారు. ఇలా చేయడం వలన అనేక పోషకాలు మిస్ అవుతున్నారు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర కాడల్ని తినే ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఎలా ఉపయోగించాలంటే
ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు నీరు పోసి మరిగించండి. ఇలా మరుగుతున్న నీటిలో కట్ చేసిన కొత్తిమీర కాడల్ని వేయండి. కొంచెం మిరియాల పొడి వేసి మరిగించండి. తర్వాత మరిగించి ఈ నీటిని వడ కట్టి తాగండి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. గుండె సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు. అంతేకాదు కొత్తిమీర కాడల నీటితో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..
రక్తంలో షుగర్ లెవెల్ నియంత్రణ: ఈ కొత్తిమీర కాడల నీటిని తాగడం వలన రక్తంలో షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కు కాడలతో కలిపి తీసుకోవడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ ఈ నీటిని తాగితే తేడా మీకే తెలుస్తుంది.
నోటి ఆరోగ్యం: చాలామంది వివిధ కారణాలతో నోటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా నోటి పూత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఈ కొత్తిమీర కాడల నీటిని తాగడం వలన నోటి పూత సమస్య తగ్గుతుంది.
View this post on Instagram
జీర్ణక్రియ: ప్రస్తుతం ఎక్కువ మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికీ మంచి మెడిసిన్ కొత్తిమీర కాడల నీరు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి రకరకాల జీర్ణ సమస్యలతో బాదపడుతుంటే మేదిసిన్స్ కు బదులుగా కొత్తిమీర కాడల నీరుని తాగడం వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎముకల ఆరోగ్యం: ఎవరైనా ఎముకల సమస్యతో ఇబ్బంది పడుతుంటే కొత్తిమీర కాడల నీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొత్తిమీర కాడల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీంతో ఈ నీటిని తవడం వలన ఎముకలు బలంగా మారతాయి. దీనిలోని శోథనిరోధక గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లో డీటాక్స్ చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








