Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

పాప్‌కార్న్‌ను సరైన పద్దతిలో తినకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. పాప్‌కార్న్‌‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని.. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..
Popcorn

Updated on: Jan 03, 2026 | 1:44 PM

పాప్‌కార్న్.. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తినే స్నాక్. సరైన పద్ధతిలో దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని.. అలాగే మార్కెట్‌లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్డ్ పాప్‌కార్న్‌ల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అవి ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు.

పాప్‌కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు:

పోషకాహార నిపుణుల ఇలా అన్నారు.. ఎలాంటి కృత్రిమ రుచులు, అధిక ఉప్పు లేదా వెన్న లేని సాదా పాప్‌కార్న్ మన శరీరానికి ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది. పాప్‌కార్న్‌లో ఉండే అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేగు కదలికలను పెంచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్(LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అటు ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక చక్కటి స్నాక్‌గా ఉపయోగపడుతుంది.

పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నశింపజేసేలా చేస్తాయి. తద్వారా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్ల సమృద్ధి వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మం ముడతలు పడటం, అల్జీమర్స్, జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది. పాప్‌కార్న్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దీని వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి స్నాక్. పాప్‌కార్న్ సహజంగా గ్లూటెన్ రహితమైనది. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు లేదా గ్లూటెన్ రహిత ఆహారాన్ని ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్.

ఇవి కూడా చదవండి

పాప్‌కార్న్ వల్ల కలిగే నష్టాలు:

సాదా పాప్‌కార్న్ ఎంత ఆరోగ్యకరమైనదో, ఫ్లేవర్స్ కలిపిన పాప్‌కార్న్ అంత హానికరం. మార్కెట్లో లభించే లేదా ఇంటి వద్ద మనం తయారు చేసుకునే ఇన్స్టాంట్ పాప్‌కార్న్‌లో అధిక మొత్తంలో ఉప్పు, బటర్, కారం, చీజ్, క్యారమెల్ లాంటివి ఉంటాయి. అధిక సోడియం, కొవ్వు: ఉప్పు, బటర్ అధికంగా ఉండటం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అధిక కొవ్వు స్థాయిలు బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. కృత్రిమ రసాయనాలు: కొన్ని ఫ్లేవర్డ్ పాప్‌కార్న్‌లలోని కృత్రిమ రంగులు ఆరోగ్యానికి మంచివి కావు. అధిక చక్కెర: క్యారమెల్ లాంటి తీపి ఫ్లేవర్స్ అధిక చక్కెరను కలిగి ఉంటాయి. ఇది మధుమేహం, దంత సమస్యలు, బరువు పెరగడానికి దారితీస్తాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.