Beauty Tips: దానిమ్మ తొక్కేకదా అని తీసిపారేయకండి.. దాని ఫేస్ మాస్క్‎తో మీ ముఖ సౌందర్యం రెట్టింపవ్వడం ఖాయం

| Edited By: Ravi Kiran

May 25, 2023 | 7:45 AM

నేటికాలంలో చాలా మంది 30 దాటకముందే ముసలివాళ్లలా కనిపిస్తున్నారు. ముఖంపై మొటమిలు, నల్లటి మచ్చలు, నుదుటిపై ముడతలు, చర్మం ముడతలు, వయస్సును మరింతగా పెంచేసి, ముఖసౌందర్యాన్ని పాడుచేస్తున్నాయి.

Beauty Tips: దానిమ్మ తొక్కేకదా అని తీసిపారేయకండి.. దాని ఫేస్ మాస్క్‎తో మీ ముఖ సౌందర్యం రెట్టింపవ్వడం ఖాయం
Beauty Tips
Follow us on

నేటికాలంలో చాలా మంది 30 దాటకముందే ముసలివాళ్లలా కనిపిస్తున్నారు. ముఖంపై మొటమిలు, నల్లటి మచ్చలు, నుదుటిపై ముడతలు, చర్మం ముడతలు, వయస్సును మరింతగా పెంచేసి, ముఖసౌందర్యాన్ని పాడుచేస్తున్నాయి. దీనంతటికి కారణం మారుతున్న జీవనశైలి. చెడు ఆహారపు అలవాట్లు. అందంగా కనిపించేందుకు మార్కెట్లో దొరితే ఖరీదైన సౌందర్యసాధనాలను ఉపయోగించకుండా..దానిమ్మ ఫ్రూట్ ఫేస్ మాస్క్ ఓసారి ప్రయత్నించి చూడండి. ఇది ముఖసౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.

దానిమ్మ పండులో ఉండే పోషకాలన్నీ తొక్కలో కూడా ఉంటాయి. ప్రధాన ముఖ సౌందర్య సమస్యలను తొలగించడంలో దీని పాత్రను మరచిపోకూడదు. దానిమ్మ గింజలు తిన్న తర్వాత, దాని తొక్కను విసిరేయకండి.

ముఖం మీద ముడతలు కనిపిస్తే:

ఇవి కూడా చదవండి

ముందుగా దానిమ్మ తొక్కను ఎండలో బాగా ఆరబెట్టి, ఎండబెట్టిన తొక్కను మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో (రెండు టేబుల్ స్పూన్లు) ఇప్పటికే గ్రైండ్ చేసిన పొడిని వేసి, దానికి కొద్దిగా పాలు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై మందంగా రాసి వేళ్ల సహాయంతో నెమ్మదిగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఆ తర్వాత సుమారు అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి.

ముఖం, మెడపై నల్ల మచ్చలు:

ఒక చిన్న గిన్నెలో సుమారు రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ పొడిని తీసుకోని… ఒక టేబుల్ స్పూన్ పెరుగు మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయండి (ఎండ కారణంగా మెడ, ముఖం నల్లగా ఉంటే, కొంచెం మందంగా రాయండి). సుమారు అరగంట పాటు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి.

ముఖంపై మొటిమలు:

టీనేజర్లలో మొటిమల సమస్యలు సర్వసాధారణం, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరి ముఖంలో మొటిమలు వస్తాయి! కొందరిలో ఎర్రటి పొక్కులా, మరికొందరిలో చీము పొక్కులా కనిపించి ముఖ సౌందర్యాన్ని పాడుచేస్తుంది! కాబట్టి ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి కోసం ఇక్కడ ఒక సింపుల్ హోం రెమెడీ ఉంది. ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ పొడిని ఒక చిన్న గిన్నెలో వేసి, సమాన పరిమాణంలో నిమ్మరసం మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి మీ మొటిమలపై అప్లై చేయండి. ఆ తర్వాత, చల్లని నీటితో కడగండి.

అందాన్ని పెంచేందుకు:

రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ తొక్క పొడిని ఒక గిన్నెలో వేసి, అంతే పరిమాణంలో రోజ్ వాటర్ కలపండి. పేస్ట్ చేయండి. ఆ తరువాత, ముఖం, మెడపై మందంగా అప్లై చేసి, సుమారు అరగంట పాటు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం