పర్యావరణాన్ని మెరుగుపరచడంలో మొక్కలు,చెట్లు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మానవజాతి వాటికి హాని కలిగించే ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ, అవి మేలు చేస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో వాయుకాలుష్యం పెరిగిపోవడానికి చెట్లను నరికివేయడమే కారణం. నిత్యం పెరుగుతున్న వాయికాలుష్యం కారణంగా.. ఎయిర్ ప్యూరిఫైయర్ల అవసరం కూడా అధికమవుతోంది. మరి ఎయిర్ ప్యూరిఫికేషన్ చేసే సహజమైన మొక్కల గురించి తెలుసుకుందామా..? ఈ మొక్కలను ఇంట్లో ఉంచడం ద్వారా ఎలక్ట్రికల్ ఎయిర్ ప్యూరిఫైయర్ల కంటే మేలైన రీతిలో పనిచేసి, స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తాయి.
ఈ మొక్కలను ఇంట్లో నాటితే.. ఎయిర్ ప్యూరిఫయర్ల అవసరం ఉండదు.
పీస్ లిల్లీ: పీస్ లిల్లీ సహజమైన గాలి శుద్ధికరణ మొక్క. ఈ మొక్కను నాటిన తర్వాత దాని కోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అది వాతావరణంలోని సూర్యకాంతిని ఇంట్లోని తేమను గ్రహిస్తుంది. తద్వారా మీకు శ్రమ తగ్గినట్లే కదా..
అయితే ఒక అధ్యయనం ప్రకారం.. ఇది ఇంట్లో సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఈ మొక్క కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విషపూరిత సమ్మేళనాలను ఇంట్లోని గాలి నుంచి తొలగిస్తుంది.
జాడే మొక్క: జాడే మొక్క అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది అలంకరణతో పాటు మానవులకు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి నిద్ర పొందడానికి కూడా సహాయపడుతుంది. ఇది ఇండోర్ తేమను పెంచుతుంది ఇంకా దుమ్ము వంటి అలెర్జీని కలిగించే కణాలతో పోరాడి మనల్ని రక్షిస్తుంది.
మనీ ప్లాంట్: సంపద, శ్రేయస్సు చిహ్నంగా ప్రజలు మనీ ప్లాంట్‌ను నాటుతారు. అయితే ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మనీ ప్లాంట్ కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన కాలుష్య కారకాలను పీల్చుకోవడం ద్వారా గాలిని శుద్ధి చేస్తుంది.
స్నేక్ ప్లాంట్: ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేసి అలర్జీలను నివారిస్తుంది. బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి క్యాన్సర్ కారక కారకాలను దూరంగా ఉంచడంలో స్నేక్ ప్లాంట్ సహాయపడుతుంది.
అరటి మొక్క: చూడడానికి అందంగా కనిపించే అరటి మొక్కలో అనేక ఔషధ ప్రయోజనాలున్నాయి. ఇది ఉంటే ఇంట్లోని గాలిని శుభ్రపరుస్తుంది. గాలిలోని హానికరమైన కణాలను గ్రహించి సహజమైన శుద్ధికరణ మొక్కగా పనిచేస్తుంది.
కలబంద మొక్క: కలబంద మొక్క హానికరమైన వాయువును తొలగించడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు. ఎయిర్ ప్యూరిఫైయర్ గానే కాక మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి..