అనాస పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. తీపిగా, పుల్లగా ఉండే అనాస పండు రుచిని చాలా మంది ఇష్టపడతారు. అలాగే దీనిలో విటమిన్ సి కి అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ ఉష్ణమండల పండు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయినప్పటికీ అనాస పండుని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, వికారం వంటి అనేక లక్షణాలు కనిపించవచ్చు. పర్డ్యూ యూనివర్శిటీ ఉద్యానవన విభాగం ప్రకారం విటమిన్ సి అధికంగా ఉండే అనాస పండ్లు పండకుండా తినకూడదు. ఎందుకంటే పండని పండుని తింటే తీవ్రమైన విరేచనాలు, వాంతుల బారిన పడవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఇక్కడ ఉన్న విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.