గతంతో పోలిస్తే నేటి కాలంలో వ్యక్తి లైఫ్‌స్టైల్ ఎంతో భిన్నంగా ఉంటోంది. మారుతున్న పరిస్థితులను బట్టి జీవనశైలిలో మార్పు వస్తోంది. ఇదే సమయంలో ఎన్నో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. చాలా మందిని పట్టిపీడిస్తున్న సమస్య బద్ధకం. మారుతున్న లైఫ్ స్టైల్‌తో పాటు బద్ధకం కూడా పెరుగుతోంది. బద్ధకం ఎక్కువ కావడంతో చాలామందిలో సోమరిపోతుతనం పెరుగుతోంది. సోమరిపోతుతనం పెరుగుతున్న వారిలో ప్రాణంతాక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం, సరైన శారీరక శ్రమ లేకపోతే ప్రాణాంతక వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కనీసం వ్యాయామం చేయనివారు ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. బద్ధకంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న వారిలో యువత కూడా ఉన్నారు. 2020 నుంచి 2030 మధ్య 50 మిలియన్లకు పైగా ప్రజలు జీవనశైలి వ్యాధుల బారిన పడనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వీరిలో 47 శాతం మంది హైపర్‌టెన్షన్ లేదా హై బీపీతో బాధపడుతుండగా.. 43 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది.
ఒక వ్యక్తి ప్రతిరోజూ 21 నిమిషాలు వ్యాయామానికి కేటాయించినట్లయితే.. ఈ వ్యాధులను 20 నుంచి 30 శాతం వరకు నివారించే అవకాశం ఉంది. ఇది డిప్రెషన్, గుండె జబ్బుల కేసులలో 7 నుంచి 8 శాతం మందిని నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. 74 శాతం మరణాలు జీవనశైలి వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయని, 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1 కోటి 70 లక్షల మంది ప్రతి సంవత్సరం జీవనశైలి వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు.
ప్రపంచంలోని ధనిక దేశాలలో 36 శాతం మంది సోమరిపోతుతనంతో ఉంటున్నారని, పేద దేశాల్లో అయితే కేవలం 16 శాతం మంది మాత్రమే సోమరిపోతు తనంతో ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 42 శాతం దేశాలు మాత్రమే నడక లేదా సైక్లింగ్ కోసం విధానాలు, సౌకర్యాలను కలిగి ఉన్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు 26 శాతం దేశాలు మాత్రమే కఠినమైన విధానాలను కలిగి ఉండగా.. 26 శాతం దేశాలు మాత్రమే వేగ పరిమితి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి. ప్రజలు యోగా, వ్యాయామం వంటివి చేస్తే రోగాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..