AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moles On Body: ఒంట్లో ఈ పార్ట్‌పై పుట్టుమచ్చ ఉంటే.. అదృష్టం తాండవమే!

సాముద్రిక శాస్త్రంలో పుట్టుమచ్చ ఉన్న శరీర భాగాన్ని బట్టి శుభ, అశుభ, అదృష్ట, దురదృష్టాన్ని తెలుసుకోవచ్చని చెబుతుంటారు కొందరు నిపుణులు. అదేవిధంగా ఈ మచ్చల ద్వారా ఎందుటి వారి వ్యక్తిత్వాన్ని కూడా సులువుగా తెలుసుకోవచ్చు. అవును శరీర భాగాల ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని పరీక్షించినట్లే..

Moles On Body: ఒంట్లో ఈ పార్ట్‌పై పుట్టుమచ్చ ఉంటే.. అదృష్టం తాండవమే!
Moles On Body
Srilakshmi C
|

Updated on: Apr 20, 2025 | 1:14 PM

Share

ప్రతి ఒక్కరికీ ముఖం, చేతులతో సహా ఒంట్లో వివిధ బాగాలపై పుట్టుమచ్చలు ఉంటాయి. సాధారణంగా ప్రతి మనిషి శరీరంపై కనీసం ఒక పుట్టుమచ్చ అయినా ఉంటుంది. సాముద్రిక శాస్త్రంలో పుట్టుమచ్చ ఉన్న శరీర భాగాన్ని బట్టి శుభ, అశుభ, అదృష్ట, దురదృష్టాన్ని తెలుసుకోవచ్చని చెబుతుంటారు కొందరు నిపుణులు. అదేవిధంగా ఈ మచ్చల ద్వారా ఎందుటి వారి వ్యక్తిత్వాన్ని కూడా సులువుగా తెలుసుకోవచ్చు. అవును శరీర భాగాల ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని పరీక్షించినట్లే, ముఖంపై ఉన్న పుట్టుమచ్చల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. మీ నుదిటిపై, పెదవులపై, బుగ్గలపై పుట్టుమచ్చ ఉంటే మీరెలాంటి వ్యక్తో ఇక్కడ తెలుసుకుందాం..

నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే..

నుదిటిపై పుట్టుమచ్చ ఉన్నవారి జీవితం పోరాటాలతో నిండి ఉంటుంది. అలాంటి వ్యక్తులు పోరాటాల తర్వాత వారి జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. అందుకే నుదిటిపై పుట్టుమచ్చ ఉన్నవారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ వ్యక్తులు సృజనాత్మకత, తెలివితేటలను కూడా కలిగి ఉంటారు.

బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే..

బుగ్గ మీద పుట్టుమచ్చ కూడా అందానికి చిహ్నంగా పరిగణిస్తారు. అయితే.. బుగ్గలపై పుట్టుమచ్చలు ఉన్నవారు సాధారణంగా ఉల్లాసంగా ఉంటారు. వారికి తమపై తమకు అమితమైన నమ్మకం ఉంటుంది. వీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇతరులతో చాలా త్వరగా కలిసిపోతారు. అంతే కాకుండా వీరు చాలా సృజనాత్మక కలిగిన వ్యక్తులు కూడా.

ఇవి కూడా చదవండి

ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే..

ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు. తరచుగా ప్రయాణిస్తుంటారు. వీరి ఈ స్వభావం వారికి జీవితంలో అనేక కొత్త అనుభవాలను ఇస్తుంది. వీరు చాలా ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులు.

ముక్కు కింద పుట్టుమచ్చ ఉంటే..

ముక్కు కింద, పెదవుల పైన పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు వారి జీవితంలో కఠినమైన క్రమశిక్షణను పాటిస్తారు. జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా వారు తమ క్రమశిక్షణ విషయంలో ఎప్పుడూ రాజీపడరు. వారి ఈ వ్యక్తిత్వమే వారిని ఇతరుల నుంచి భిన్నంగా చేస్తుంది.

పెదవులపై పుట్టుమచ్చలు ఉంటే..

పెదవిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి మాట్లాడే శైలి నుంచి వారి జీవనశైలి, వారి పని వరకు ప్రతిదీ ఆకర్షిస్తుంది. అందువలన, వారు తమ మనోహరమైన వ్యక్తిత్వంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. జీవితంలో ఎన్నో సాధిచాలని చాలా ఆశయాలు కలిగి ఉంటారు.

గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే..

గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్నవారు దయగలవారు. వీరు విజయవంతమైన, సమతుల్య జీవితాలను గడుపుతారు. తార్కికంగా ఆలోచిస్తారు. కానీ వీరు కొంచెం మొండిగా ఉంటారు. మొత్తంమీద వీరు దృఢ నిశ్చయం, శ్రద్ధగల వ్యక్తులు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.