Perfect Tea: టీ ఇలా తయారు చేశారంటే.. టేస్ట్ అదిరిపోతుందంతే?

|

Jan 06, 2025 | 8:57 PM

ఉదయాన్నే నిద్రలేవగానే కప్పు వేడివేడి టీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభంకాదు. వేడి వేడిగా తీయని తేనీరు అలా గొంతు జారుతుంటే నిద్ర మత్తు ఒక్కసారిగా వదిలిపోయి ఒంట్లోకి ఉత్సాహం ఉరకలు వేస్తూ పరుగెత్తుతుంది. అయితే పర్ ఫెక్ట్ టీ పెట్టడం అందరికీ రాదు. ఈ కింది పద్ధతిలో టీ తయారు చేశారంటే రుచి అదిరిపోతుందంటున్నారు నిపుణులు..

Perfect Tea: టీ ఇలా తయారు చేశారంటే.. టేస్ట్ అదిరిపోతుందంతే?
Perfect Tea
Follow us on

టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది తమ రోజును ఒక కప్పు వేడి వేడి టీ తాగడం ద్వారా ప్రారంభిస్తారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు కాఫీ తాగి రిలాక్స్‌గా అయితే ఆ మజానే వేరు. మిల్క్ టీ, జింజర్ టీ, లెమన్ టీ, రోజ్ టీ, మ్యాంగో టీ, కేసరి టీ ఇలా రక రకాల టీలు ఉన్నాయి. కానీ కొందరికి పర్‌ఫ్టెక్ట్‌ టీని ఎలా తయారు చేస్తారో తెలియదు. అవును.. కొందరికి టీ తయారు చేసే సరైన పద్ధతి అస్సలు తెలియదు. నిజానికి.. ఈ కింది పద్ధతిలో టీ తయారు చేస్తే రుచి అదిరిపోతుంది. ఎలా చేయాలంటే..

టీ తయారీ విధానం 1

టీ పొడిని ముందుగా నీళ్లలో మరిగించి సంప్రదాయ పద్ధతిలో టీ తయారు చేసే విధానం ఇది. ఒక పాత్రలో అవసరమైన మొత్తంలో నీటిని తీసుకుని గ్యాస్ స్టవ్ మీద మరిగించాలి. అందులో టీ పొడి వేసి కొన్ని నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అవసరమైన మేరకు పాలు, పంచదార వేసి బాగా మరిగించాలి. ఈ టీని వడకట్టి సర్వ్‌ చేస్తే రెడీ. ఇది ఖడక్ ట్రెడిషనల్ స్టైల్ టీ. ఇది బలే రుచిగా ఉంటుంది.

టీ తయారీ విధానం 2

కొందరు పాలు, నీళ్లు మరిగించి టీ తయారు చేస్తారు. క్రీమీయర్ టీని ఆస్వాదించేవారిలో ఈ పద్ధతి చాలా నచ్చుతుంది. పాలు, నీళ్లు 2:1 నిష్పత్తిలో తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత అందులో టీ పొడి, పంచదార వేయాలి. పాలు, నీళ్ల మిశ్రమాన్ని బాగా మరిగించాలి. టీ కాచేటప్పుడు మృదువైన సుగంధ వాసన వెలువడుతుంది. అప్పుడు అందులో సరిపడా షుగర్‌ జోడించి వడకట్టి రెడీసర్వ్‌ చేసుకోవాలి. ఈ తాగితే రుచిగా ఉంటుంది.

ఏ పద్ధతి మంచిది?

టీ చేయడానికి ఉత్తమ మార్గం రుచి, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. పర్‌ఫెక్ట్ ఖడక్ టీని ఇష్టపడేవారు ముందుగా టీ పొడిని నీటిలో వేసి మరిగించే సంప్రదాయ పద్ధతిని ఎంచుకోవచ్చు. లేదా క్రీమీ రిచ్ ఫ్లేవర్డ్ టీని తాగాలనుకునే వారు పాలు, నీళ్ల మిశ్రమంతో టీ తయారుచేసే ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఎలా చేసినా టీ రుచి అదిరిపోతుంది.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.