Dry Fruits for Sugar: షుగర్ వ్యాధి ఉన్నవారు డ్రై ఫ్రూట్స్‌లో వీటిని అస్సలు తినకూడదు..

|

Aug 04, 2024 | 3:07 PM

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ డైటీ రొటీన్‌లో చేర్చుకుంటే దీర్ఘకాలిక వ్యాధులను సైతం రాకుండా శరీరానికి రక్షణగా నిలుస్తాయి. అయితే షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లు మాత్రం డ్రై ఫ్రూట్స్‌లో కొన్నింటిని అస్సలు తినకూడదట. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ షుగర్ వ్యాధి పేషెంట్లు తినకపోవడమే మంచిది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో..

Dry Fruits for Sugar: షుగర్ వ్యాధి ఉన్నవారు డ్రై ఫ్రూట్స్‌లో వీటిని అస్సలు తినకూడదు..
Dry Fruits
Follow us on

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ డైటీ రొటీన్‌లో చేర్చుకుంటే దీర్ఘకాలిక వ్యాధులను సైతం రాకుండా శరీరానికి రక్షణగా నిలుస్తాయి. అయితే షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లు మాత్రం డ్రై ఫ్రూట్స్‌లో కొన్నింటిని అస్సలు తినకూడదట. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ షుగర్ వ్యాధి పేషెంట్లు తినకపోవడమే మంచిది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్‌ అనేవి వేగంగా పెరుగుతాయి. కాబట్టి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌కి డయాబెటీస్ పేషెంట్లు దూరంగా ఉండాలి. మరి షుగర్ ఉన్నవారు ఏ డ్రై ఫ్రూట్స్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష దీన్నే కిస్ మిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. షుగర్ వ్యాధి ఉన్నవారు డ్రై ఫ్రైట్స్‌లో ఎండు ద్రాక్షను అస్సలు తీసుకోకుండా ఉండటమే మంచిది. నిజానికి ఎండు ద్రాక్ష తినడం చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. కానీ ఈ కిస్ మిస్‌లో చక్కెర శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి వీటిని తినకపోవడమే బెటర్.

ఖర్జూరం:

ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే డయాబెటీస్ ఉన్నవారు ఖర్జూరం కూడా తినకూడదు. ఎందుకంటే ఇందులో కూడా చక్కెర శాతం అనేది అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి దూరంగా ఉండటం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

అంజీర్:

అంజీర్ కూడా షుగర్ వ్యాధితో బాధ పడే పేషెంట్లు అస్సలు తీసుకోక పోవడమే బెటర్. ఎందుకంటే ఇందులో కూడా నేచురల్ షుగర్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి డయాబెటీస్‌ ఉన్నారు అంజీర్‌ తినకపోవడమే మంచిది.

డ్రై క్రాన్ బెర్రీస్:

షుగర్ వ్యాధి ఉన్నవారు డ్రై క్రాన్ బెర్రీస్ కూడా తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల మూత్రానికి సంబంధిత వ్యాధులను.. తగ్గించడానికి ఎంతో బాగా సహాయ పడుతుంది. కానీ ఇందులో నేచుర్ షుగర్ లెవల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకుంటే షుగర్ అనేది పెరగవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..