
రావి ఆకులు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాదు.. రావి ఆకులలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది డయాబెటిస్ బాధితులకు, రక్తంలో షుగర్‌ని కంట్రోల్ చెయ్యడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాజా, ఆకుపచ్చ రావి ఆకులను తీసుకుని శుభ్రంగా, రసాయనాలు లేకుండా కడిగి తీసుకోవాలి. వీటిని శుభ్రం చేసి నీటిలో వేసుకుని 10 నుంచి15 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత ఫిల్టర్ చేసి టీగా తాగవచ్చు. రోజుకు ఒకసారి ఇలా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది.
లేదంటే, రావి ఆకులను ఎండబెట్టి, పొడి చేసి ఒక టీస్పూన్ పొడిని నీటితో లేదా తేనెతో కలిపి రోజూ తీసుకోవచ్చు. ఇలా కూడా ఆకుల లోని గుణాలు శరీరం లోపలికి చేరి, ప్రయోజనం కలుగుతుంది.అయితే, రావి ఆకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా తగ్గిపోవచ్చు. అందుకే పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే, నిపుణుల సలహాతో వాడాలి. రోజూ వాడుతుంటే, ఆ తేడా తెలుస్తుంది.
రావి ఆకులలోని ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు గ్లూకోజ్ అతిగా రక్తంలో కలవడాన్ని తగ్గిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. డయాబెటిస్ నియంత్రణతో పాటు, రావి ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. కాబట్టి చాలా మేలు జరుగుతుంది. అయితే,డయాబెటిస్ మందులు తీసుకునే వారు రావి ఆకులను ఉపయోగించే ముందు డాక్టర్‌ని సంప్రదించాలి. ఎందుకంటే ఈ ఆకులు, మందుల వల్ల మొత్తంగా షుగర్ లెవెల్స్ అతిగా పడిపోవచ్చు.
(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.