
వెల్లుల్లి మన భారతీయవంటకాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. వెల్లుల్లి లేకుంటే వంటలకు రుచి ఉండదు. అందుకే భారతీయుల వంటగదిలో తప్పనిసరిగా వెల్లుల్లి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు కంటే…వెల్లుల్లి పొట్టు తయడం చాలా కష్టం. వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ సి, సెలీనియం, ఫైబర్, 4.5 కేలరీలు, 0.2 గ్రాములు, 1 గ్రాము పిండి పదార్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి పొట్టు తీసేందుకు మీరు ఇబ్బంది పడుతుంటే…మీకోసం కొన్ని చిట్కాలు అందిస్తాం. వెల్లుల్లిని తీసేందుకు ఈ చిట్కాలను ఉపయోగిస్తే అద్భుతంగా పనిచేస్తాయి. వెల్లుల్లి పొట్టును తీసే విధానం ఏంటో తెలసుకుందాం.
తేలికగా వేడి చేయండి:
వెల్లుల్లిని పాయలుగా విడతీయండి. ఇఫ్పుడు చిన్న మంటపై ప్యాన్ పెట్టి వేడి చేయండి. వెల్లుల్లిపాయలను ప్యాన్ మీద వేసి తేలికగా వేడి చేయండి. ఇలా చేయడం ద్వారా పొట్టు సులభంగా వస్తుంది. కానీ అతిగా వేడి చేయకూడదు. అలా చేస్తే వెల్లుల్లి రుచి తగ్గిపోతుంది.
రోలింగ్ పిన్ :
వెల్లుల్లి పొట్టును రోలింగ్ పిన్ తో తీయడం చాలా ఈజీ. దీన్ని ఉపయోగించి, మీరు కొన్ని నిమిషాల్లోనే చాలా వెల్లుల్లి పాయల పొట్టను సులభంగా తీస్తారు. దీన్ని ఉపయోగించడానికి రోలింగ్ పిన్ తీసుకోండి. ఇప్పుడు డౌ బాల్ వలె వెల్లుల్లిపాయల మీద అటు ఇటు తిప్పండి. ఇలా రెండు మూడు సార్లు తిప్పినట్లయితే…వెల్లుల్లి పొట్టు సులభంగా వస్తుంది.
వేడి నీటితో:
వెల్లుల్లి పొట్టును తీసేందుకు వేడినీటిని కూడా ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలను వెల్లుల్లి పొట్టును తీసేందుకు చాలా ఉపయోగడపతాయి. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని..అందులో వెల్లుల్లిపాయలు వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గిన్నెను ఓవెన్ లో కొన్ని నిమిషాల పాటు ఉంచండి. అందులో నంచి తీసి అర చేతితో రుద్దండి. అంతే ఎంతో ఈజీగా వెల్లుల్లిలోని పొట్టంతా తొలగిపోతుంది.
కత్తి సహాయంతో:
మీరు దానిని కత్తితో వెల్లుల్లిని రెండు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మీరు వెల్లుల్లి రెబ్బలను కత్తితో రెండు ముక్కలుగా కట్ చేస్తే. పై తొక్క చాలా సులభంగా తొలగిపోతుంది. అయితే వెల్లుల్లి పొట్టును తీసేందుకు పదునైన కత్తిని ఉపయోగించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం…