ఘుమఘుమలు సరే.. బిర్యానీతో బరువు తగ్గుతారని తెలుసా ??

ఘుమఘుమలు సరే.. బిర్యానీతో బరువు తగ్గుతారని తెలుసా ??

Phani CH

|

Updated on: Jun 03, 2023 | 6:41 PM

పూల నుంచి సువాసనలు రావడం తెలుసు. కానీ అన్నం నుంచి సుగంధ పరిమళం వస్తే..! అలాంటి అన్నాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. పొడవైన మెతుకులు, ముత్యాల మాదిరి మెరిసిపోతున్నాయి. ముట్టుకుంటే మల్లెపువ్వంత మెత్తగా ఉన్నాయి. వాటి నుంచి సెంట్ కొట్టినట్లు మంచి వాసన వస్తోంది.

పూల నుంచి సువాసనలు రావడం తెలుసు. కానీ అన్నం నుంచి సుగంధ పరిమళం వస్తే..! అలాంటి అన్నాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. పొడవైన మెతుకులు, ముత్యాల మాదిరి మెరిసిపోతున్నాయి. ముట్టుకుంటే మల్లెపువ్వంత మెత్తగా ఉన్నాయి. వాటి నుంచి సెంట్ కొట్టినట్లు మంచి వాసన వస్తోంది. ఆ వాసనకు ఆకలి మరింత పెరిగింది. ముద్దముద్దకు మనసు మురిసిపోయింది. తొలిసారి బిర్యానీ తిన్నప్పుడు కలిగిన అనుభవం అది. బాస్మతి అనే పేరును విన్నది కూడా అప్పుడే. బిర్యానీతో ప్రేమలో పడిపోయింది కూడా అప్పుడే. ఇంతకూ బాస్మతికి ఇంతటి సువాసన ఎలా వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా సువాసన వచ్చే బియ్యపు రకాలు చాలా ఉన్నా దీన్ని మాత్రమే క్వీన్ ఆఫ్ అరోమాటిక్ రైస్ అని ఎందుకు అంటారు? బాస్మతికి చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. మంచి వాసనను బియ్యం వెదజల్లుతూ ఉంటుంది. అన్నం రుచి తియ్యగా ఉంటుంది. వండిన తరువాత అన్నం మెతుకులు సన్నగా ఉండి, 12 నుంచి 20 మిల్లీమీటర్ల వరకు పొడవుగా ఉంటాయి. మెతుకులు ఒకదానికొకటి అంటుకోవు. అరోమాటిక్ రైస్ రకాల్లో ఉండే కొన్ని జన్యువుల వల్ల వాటి నుంచి సువాసనలు వస్తాయంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. బాస్మతిలో బీటైన్ అల్డిహైడ్ డీహైడ్రోజనైజ్ అంటే బీఏడీహెచ్2 అనే జన్యువు ఉంటుంది. ఈ జన్యువు కారణంగా 2-అసిటైల్-1-పిరొలీన్ అనే ఒక కాంపౌండ్ అంటే సమ్మేళనం బాస్మతిలో ఏర్పడుతుంది. దీని వల్లనే దానికి ఆ సువాసన వస్తుందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: హాలీవుడ్‌ను తాకిన గుంటూరు కారం | శర్వా పెళ్లిలో.. రామ్‌ చరణ్ హంగామా

Rain Alert: 4 రోజుల పాటు వానలే వానలు.. ఎల్లో అలర్జ్ జారీ..

Cooking Oil: సామాన్యులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు