Peanut & Jaggery Benefits: పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

|

Jun 09, 2021 | 12:38 PM

పల్లీ పట్టీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ వీటిని ఇష్టపడతారు. పల్లీలను బెల్లంతో...

Peanut & Jaggery Benefits: పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
Groundnut
Follow us on

పల్లీ పట్టీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ వీటిని ఇష్టపడతారు. పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ రెండూ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, పాస్పరస్, నియాసిస్, థయామిన్ వంటి పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు పల్లీ పట్టీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

పల్లీ పట్టీలను తినడం వల్ల మనకు ఎక్కువగా ఐరన్ లభిస్తుంది, దీని వల్ల ఎముకులు స్ట్రాంగ్ అవుతాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే వీటితో విటమిన్ ఏ, ఈలు పుష్కలంగా అందుతాయి. రోజూ బెల్లం పట్టిలు తినడం వల్ల గుండె జబ్బులు కూడా దూరమవుతాయి. వీటితో పాటు పల్లీ పట్టీల ద్వారా ఇంకా లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..

  • ప్రతీ రోజూ పల్లీపట్టీలు తింటే రక్తం శుద్ధి అవుతుంది
  • రక్తహీనత సమస్య తీరేందుకు బాగా సహాయపడుతుంది
  • రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది
  • శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది
  • ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే రోజంతా హుషారుగా ఉంటారు
  • చర్మం తాజాగా మారుతుంది. మచ్చలు తొలగిపోతాయి

ఇవి చదవండి:

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్‌.. కుక్క ఓవర్‌ స్పీడ్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో

ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..

వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..