Diwali 2021: దీపావళి పండగకి ఈ రోగులు దూరంగా ఉండాలి.. లేదంటే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది..

|

Nov 02, 2021 | 8:17 PM

Diwali 2021: దీపావళి పండుగ దగ్గర పడింది. ఈ పండుగను జరుపుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొగ, క్రాకర్ల శబ్దం కారణంగా కొందరు రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Diwali 2021: దీపావళి పండగకి ఈ రోగులు దూరంగా ఉండాలి.. లేదంటే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది..
Diwali
Follow us on

Diwali 2021: దీపావళి పండుగ దగ్గర పడింది. ఈ పండుగను జరుపుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొగ, క్రాకర్ల శబ్దం కారణంగా కొందరు రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే దీపావళి రోజున ఇలాంటి వారు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా ఆస్తమా రోగులు బయటకు వెళ్లడం మానుకోవాలి. ఎల్లప్పుడు ఇన్‌హేలర్‌ను దగ్గర ఉంచుకోవాలి. అలాగే పొగ పీల్చకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

దేశంలో ఆస్తమా రోగులు విపరీతంగా పెరుగుతున్నారు. వీరు దీపావళి రోజు రాత్రి, మరుసటి రోజు ఉదయం కూడా బయటకు వెళ్లవద్దు. ఎందుకంటే ఈ సమయంలో కాలుష్య స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. హృద్రోగులు క్రాకర్స్ పేల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాణాసంచా పేల్చినప్పుడు గుండె చప్పుడు వేగంగా పెరిగి ధమనులు కుచించుకుపోతాయి. అటువంటి పరిస్థితిలో గుండె రోగులకు సమస్యలు ఏర్పడుతాయి. దీనివల్ల హృద్రోగులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
దీపావళి రోజున చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని పటాకులకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే బాణాసంచా పొగ వల్ల పిల్లలకు కళ్లలో సమస్యలు వస్తాయి. అదనంగా వారు తీవ్రమైన అలెర్జీలకు కూడా గురవుతారు. అదేవిధంగా వృద్దులను గమనించాలి. పటాకుల రేణువు ఏదైనా కంటిలోకి పడితే కళ్లని రుద్దకూడదు. కాలిన గాయాలు లేదా కంటిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. వీటితో పాటు పటాకులు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.

Indian Currency: కరెన్సీ నోట్లు ఏ విధంగా తయారు చేస్తారో మీకు తెలుసా..! ఆశ్చర్యపోతారు..

SA vs BAN, T20 World Cup 2021: పోరాడి ఓడిన బంగ్లా టైగర్స్.. సెమీస్ రేసు నుంచి ఔట్.. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

Zodiac Signs: నవంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. చాలా అదృష్టవంతులు.. అందులో మీరున్నారా!