
నేటి వేగవంతమైన జీవితంలో పనిభారం, మానసిక ఒత్తిడి కారణంగా చాలామంది త్వరగా అలసిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులలో శారీరక బలహీనత, నీరసం ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది అల్లోపతి మందులను ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రాచీన ఆయుర్వేద మూలికల సాయంతో శరీరానికి సహజసిద్ధమైన శక్తిని అందించవచ్చని పతంజలి ఆయుర్వేదం చెబుతోంది. అందుకోసం దివ్య యౌవనామృత్ వటి అనే ఆయుర్వేద ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఇది పతంజలి ఆయుర్వేదం నుండి వచ్చిన ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద ఫార్ములా. శరీరానికి అవసరమైన పోషణను అందించడంతో పాటు, సహజమైన బలాన్ని చేకూర్చడానికి ఇది రూపొందించబడింది.
ఈ ఔషధాన్ని అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద మూలికల మిశ్రమంతో తయారు చేశారు. జాపత్రి, జాజికాయ, కుంకుమపువ్వు, శతావరి, ముస్లి, స్వర్ణ భస్మం, కౌంచ గింజలు, అకర్కర వంటి మూలికలతో తయారుచేశారు.ఈ మూలికలు శరీరాన్ని లోపలి నుండి బలోపేతం చేస్తాయి. మానసిక అలసటను తగ్గించి మెదడును ప్రశాంతపరుస్తాయి.
ఇది పూర్తిగా ఆయుర్వేద మూలికలతో తయారు చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పతంజలి తెలిపింది.
ఉత్పత్తి లేబుల్ ప్రకారం.. ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత 1 లేదా 2 మాత్రలను నీటితో లేదా పాలతో తీసుకోవచ్చు. అయితే సరైన ఫలితాల కోసం నిర్ణీత సమయంలోనే తీసుకోవడం ముఖ్యం.
(Note: సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఔషధాన్ని వాడే ముందు కచ్చితంగా ఆయుర్వేద నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించాలి.)