Parenting Tips: మీకు అబ్బాయి ఉంటే.. ఈ విషయాలను నేర్పించడం మర్చిపోకండి

|

Mar 14, 2022 | 2:12 PM

Parenting Tips:  మీకు అబ్బాయి  ఉన్నాడా..? అయితే తల్లిదండ్రులు  కొన్ని విషయాలను నేర్పించండం ముఖ్యం. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంటుంది...

Parenting Tips: మీకు అబ్బాయి ఉంటే.. ఈ విషయాలను నేర్పించడం మర్చిపోకండి
Follow us on

Parenting Tips:  మీకు అబ్బాయి  ఉన్నాడా..? అయితే తల్లిదండ్రులు  కొన్ని విషయాలను నేర్పించండం ముఖ్యం. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించే విషయాలు వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు (Parents) ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం ఎంతో ముఖ్యం. సమాజంలో మెలగడం, ఇంట్లో పనుల విషయంలో, ఇతరులను ఎలా గౌరవించాలి.. సహాయం చేయడం వంటి అంశాలను వారికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించేదాని బట్టి పిల్లవాడు ఎదుగుతాడు. ఎదుగుతున్నకొద్ది పద్దతులు మార్చుకుంటాడు. సమాజంలో మంచి గౌరవం పొందుతాడు. అయితే కొడుకుకు ఎలాంటి విషయాలు నేర్పించాలో చూద్దాం.

  1. స్త్రీవాదం అనేది సమానత్వమని మీ కొడుకుకు నేర్పండి. అలాగే లింగ వివక్ష చూపకూడదని నేర్పించండి.
  2. సాధారణంగా అమ్మాయిలు మాత్రమే ఏడుస్తారని, నువ్వెందుకు ఏడుస్తున్నావని కండిషన్లు పెట్టకండి.
  3. వంటగదికి సంబంధిచిన విషయాలలో కూడా తోసిపుచ్చినట్లు చెప్పండి. వంట చేయడం, పాత్రలు కడుక్కోవడం వంటి పనులు స్త్రీలే కాకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరు చేయాల్సినవని నేర్పించండి.
  4. మానవులతో సహా ప్రతి జీవి దయకు అర్హుడని మీ కొడుకుకు నేర్పండి. ఎవ్వరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దని, పద్దతిగా ఉండాలని సూచించింది.
  5. అలా నేర్పడం వల్ల వారిలో మంచి అలవాట్లు అవర్చుకుంటారు. ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ఉండాలని, మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏది లేదని బోధించండి.
  6. అనుకున్నది చేయాలని, ఏదైనా పని చేసేందుకు వెనుకడుగు వేయవద్దని, ధైర్యంతో ముందుకెళితే అనుకున్నది సాధిస్తామని చెప్పండి. ప్రపంచంలో ఏ పని చేయాలన్న ఆడ, మగ అనే తేడా ఉండదని, ఎవ్వరైనా చేయాలనుకున్న చేయవచ్చని, అందుకు మొహమాటానికి పోవద్దని మీ కొడుకుకు సూచించండి.
  7. కులం, మతం, ఆడ, మగ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉండాలని మీ కొడుకుకు నేర్పించండి. ఎప్పుడు కూడా అబద్దం చెప్పకూడదని సూచించండి.
  8. అహంకారానికి పోకుండా అందరితో కలిసి నడుచుకోవాలని చెప్పండి. సాన్నిహిత్యంగా ఉండడమే కాకుండా గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరిని గౌరవించాలని తెలుపండి.
  9. ఎలాంటి సమయంలోనైనా మాట్లాడేందుకు సంకోచించకూడదని, అవసరమైనప్పుడు మాట్లాడడానికి వెనుకాడకూదని చెప్పండి. ఎలాంటి విషయాలనైనా మనసులో ఉంచుకోకుండా బహిరంగంగా చెప్పడం నేర్చుకోవాలని చెప్పండి.
  10. జీవితం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండదని మీ కొడుకుకు నేర్పించండి. ఒకరి రూపాన్ని, వేషాధారణను లేదా నైపుణ్యాలను ఎగతాళి చేయకూడదని సూచించండి.
  11. అవసరమైన సమయంలో సమాయం చేయడానికి వెనుకాడకుండా ముందుకెళ్లాలని నేర్పించండి. సమస్యలను ప్రశాంతగా పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలని, పోరాటాలు ఎప్పుడు దేనిని పరిష్కరించలేవని చెప్పండి.
  12. పరిశుభ్రమైన పద్దతులను అనుసరించాలని, రోజువారీగా గోర్లు కత్తిరించుకోవడం, గదులను శుభ్రంగా ఉంచుకోవడం మన కర్తవ్యమని నేర్పించండి.

ఇవి కూడా చదవండి:

Rare Fish: అరుదైన కొత్త జాతి చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు

Sabja Seeds: సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు.. మధుమేహం ఉన్నవారికి..