
Parent Children
పిల్లలను పెంచి పెద్ద చేయడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. పిల్లల పెంపకంలో ఏదైనా తప్పు జరిగినా అది తల్లిదండ్రులదేనంటుంటారు. పిల్లల ప్రవర్తనలో, వారి నడవడికలో మార్పులు తీసుకువచ్చేది తల్లిదండ్రులే. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలతో తెలివిగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారో వారి పిల్లలు అదేవిధంగా ప్రవర్తిస్తుంటారు. మీరు పిల్లలకు మెరుగైన సంరక్షణను అందించాలనుకుంటే మీ మధ్య మంచి ప్రవర్తనను కొనసాగించాలి. ఇది మాత్రమే కాదు అన్ని సమయాల్లో పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తే ఆ తరువాత పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి విషయాలను దాయడం నేర్చుకుంటారు. వారిపై తల్లిదండ్రులు ప్రవర్తించే విధానం బట్టి పిల్లల్లో మార్పులు ఉంటాయని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ప్రవర్తించే తీరును బట్టి పిల్లలు వారికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఏ తప్పుల వల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతారో తెలుసుకుందాం.
- పిల్లలు మీతో మాట్లాడాలనుకుంటే వారికి మాటలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి.
- మీరు సంభాషణ సమయంలో ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ని ఉపయోగిస్తుంటే మీరు వారి మటలను సీరియల్‌గా తీసుకోవడం లేదని వారికి అనిపిస్తుంది. ఇలా చేయడం ద్వారా వారు మీ నుంచి దూరం జరగడం మొదలు పెడతారు.
- పిల్లలకు వారి తల్లిదండ్రులే సర్వస్వం. అటువంటి పరిస్థితిలో పిల్లలకు మీ అవసరం వచ్చినప్పుడే వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి. లేదంటే పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అలాగే మీపై కోపంగా ఉంటారు. ఇది మాత్రమే కాదు.. వారి మనస్సులో విచారం, కోపం తలెత్తే అవకాశాలున్నాయి. జీవితాంతం మీ నుంచి దూరం ఉంచడానికి కారణం కావచ్చని గుర్తించుకోండి.
- పిల్లల పెంపకంలో తప్పులను సరిదిద్ధడం కూడా చాలా అవసరం. కానీ మీరు వారితో తప్పు ప్రవర్తించడం, ప్రతి నిత్యం వారిని మందలించడం కూడా ప్రమాదమే. దీని వల్ల మీపై కోపం పెరిగిపోతుంది. ప్రేమ తగ్గిపోతుంది. దీంతో మీపై ఎదురు తిరిగే అవకాశలున్నాయి.
- మీరు మీ పిల్లలను ఇతరులతో పోల్చడం సరికాదు. దీంతో మీ మధ్య గ్యాస్ ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే పిల్లల పట్ల ఎల్లప్పుడు కూడా వివక్ష చూపడం వంటివి చేస్తే మీరు వారికి విలువ ఇవ్వరు అని వారు గ్రహిస్తారు. వారి మనసులో మీ పట్ల కోపం పెరిగిపోతుంది. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారని మీతో దూరం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి