
భారతదేశంలో స్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంది. రకరకాల స్వీట్స్ ఉన్నాయి. ఎటువంటి సందర్భంలోనైనా స్వీట్స్ కు ప్రత్యెక స్థానం ఉంది. కొంతమందికి ఆహారం తిన్న తర్వాత కూడా స్వీట్లు తినాలని కోరుకుంటారు. పండగలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వాటి సందర్భాల్లో ఇళ్లలో స్వీట్లు తప్పనిసరి. మన దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం దాని సొంత ప్రత్యేకమైన స్వీట్లను కలిగి ఉంది. ఈ స్వీట్స్ భిన్నమైన రుచితో పాటు వాటి వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక తీపి వంటకం కరాచీ హల్వా. ఆ పేరు వినగానే ప్రజల మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఏమిటంటే.. ఈ స్వీట్ పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చిందా అని…
అవును.. ఈ స్వీట్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చింది. కరాచీ హల్వా చరిత్ర ఎంత ఆసక్తికరంగా ఉంటుందో.. భారతదేశంతో దాని సంబంధం కూడా అంతే ప్రత్యేకమైనది. ఈ స్వీట్ రంగు రంగులుగా జెల్లీలా ఉంటుంది. అంతేకాదు ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రోజు మనం కరాచీ హల్వా అంటే ఏమిటి? దాని చరిత్ర ఏమిటి? భారతదేశంతో దీని ప్రత్యేక సంబంధం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. దీనితో పాటు.. ఈ కరాచీ హల్వాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే ఎవరైనా సరే ‘వావ్’ అని అంటారు.
కరాచీ హల్వాను మొక్కజొన్న పిండి, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు. దీని ఆకృతి జెల్లీ లా ఉంటుంది. ఇది ఎరుపు, పసుపు , ఆకుపచ్చ రంగులలో తయారవుతుంది. ఈ హల్వా జీవిత కాలం సుదీర్గం అని చెప్పవచ్చు. ఈ స్వీట్‌ను 6 నెలల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు.
కరాచీ హల్వా పాకిస్తాన్ సంప్రదాయ తీపి పదార్థం. అయితే భారతదేశంలో కూడా దీనికి ప్రముఖ స్థానం ఉంది. కరాచీ హల్వాను భారతదేశంలో బాంబే హల్వా అని పిలుస్తారు. దీని పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిజానికి ఈ హల్వాను కరాచీ నగరానికి చెందిన ఆయ కా హల్వాయ్ కుటుంబం భారతదేశానికి తీసుకువచ్చింది. దీనిని నేడు చందు హల్వాయ్ కరాచీ హల్వా అని పిలుస్తారు. దేశ విభజన తర్వాత చందు హల్వాయ్ ఈ హల్వాను ముంబైలో అమ్మడం ప్రారంభించాడు. క్రమంగా ఈ స్వీట్ ముంబై ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. నేడు స్వీట్ స్టాల్స్ లో హల్వా అమ్మకాలు సర్వ సాధారణం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..