డబ్బు ఆదా చేసే చిట్కాలు మీకోసం..! ఇకపై వీటిని వృథా చేయకండి..!
నారింజ రుచికరమైన పండుగా మాత్రమే కాకుండా దాని తొక్కలు కూడా ఇంటి పనుల్లో అద్భుతంగా ఉపయోగపడతాయి. చెత్త బుట్టలోని దుర్వాసన పోగొట్టడం నుంచి ఫ్రిజ్ తాజాగా ఉంచడం, మైక్రోవేవ్ శుభ్రం చేయడం వరకు ఎన్నో పనులకు నారింజ తొక్కలు సహజ పరిష్కారంగా ఉపయోగపడతాయి. ఇకపై వాటిని పారేయకుండా వినియోగించండి.

నారింజ అనేది అందరికీ ఇష్టమైన పండ్లలో ఒకటి. రుచితో పాటు ఆరోగ్యానికి చాలా లాభాలను ఇస్తుంది. కానీ నారింజ తొక్కలను చాలా మంది వ్యర్థంగా పారేస్తారు. నిజానికి వాటితో మన ఇల్లు శుభ్రంగా ఉంచడమే కాకుండా మంచి వాసన వచ్చేలా కూడా చేసుకోవచ్చు. ఇకపై నారింజ తొక్కలను పారేయకండి. ఇలా ఉపయోగించండి.
చెత్త బుట్ట వాసన
చెత్త పడేసే చోట ఎప్పుడూ చెడు వాసన వస్తుంది. అలాంటి వాసనను తగ్గించడానికి నారింజ తొక్కలు సాయపడతాయి. అవి చెత్త బుట్టలో వేసుకుంటే దుర్వాసన పోయి మంచి వాసన వస్తుంది. అలాగే చిన్న మరకలను తొలగించడంలో కూడా ఇవి సాయపడతాయి.
ఫ్రిజ్‌లోని చెడు వాసన
ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు పెట్టడం వల్ల చెడు వాసన రావడం మామూలే. ఎంత శుభ్రం చేసినా వాసన పూర్తిగా పోదు. అలాంటి సందర్భాల్లో ఒక చిన్న గిన్నెలో నారింజ తొక్కలు వేసి ఫ్రిజ్‌లో ఉంచితే అవి చెడు వాసనను పీల్చుకుని ఫ్రిజ్‌ని తాజాగా ఉంచుతాయి. ఇవి రెండు రోజుల వరకు ఉపయోగకరంగా ఉంటాయి.
మైక్రోవేవ్ క్లీనింగ్
మైక్రోవేవ్‌లో పేరుకున్న మరకలను సులభంగా తొలగించడానికి నారింజ తొక్కలు చాలా ఉపయోగపడతాయి. మైక్రోవేవ్ సురక్షిత గిన్నెలో కొద్దిగా నీటితో పాటు నారింజ తొక్కలు వేసి కొన్ని నిమిషాలు వేడి చేయండి. ఆ ఆవిరి మైక్రోవేవ్ లోపల ఉన్న మరకలను కరిగించి సులభంగా శుభ్రం చేయడానికి సాయపడుతుంది. చెడు వాసన కూడా పోతుంది.
వంటింటి మరకలు
వంటింట్లో ఉన్న గట్టి మరకలను తొలగించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అలాంటి మరకలను నారింజ తొక్కతో రుద్ది కడిగితే సులభంగా తొలగిపోతాయి. తొక్కలో ఉన్న సిట్రస్ తత్వం మరకలను కరిగించి సులభంగా శుభ్రం చేస్తుంది.
మొక్కలకు రక్షణ
నారింజ తొక్కలు మొక్కలను కూడా కాపాడగలవు. వాటి వాసన తెగుళ్లను దూరంగా ఉంచుతుంది. ఫలితంగా మొక్కలు బాగా పెరుగుతాయి. ఇది సహజమైన రక్షణ పద్ధతి అని చెప్పవచ్చు.




