Optical Illusion: తోడేళ్ళ గుంపులో దాగున్న సాలీడు.. ఐదు సెకన్లలో గుర్తిస్తే మీరు తోపు..

ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రెయిన్ టీజర్స్ మొదలైనవి సోషల్ మీడియాలో నిరంతరం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ పజిల్స్‌ను పరిష్కరించాలంటే దృష్టి, మెదడు శక్తి రెండూ అవసరమే. అలాంటి సవాలును పరిష్కరిస్తే కలిగే ఆనందం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు చాలా కష్టమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో తోడేళ్ల గుంపు ఉంది. వీటి మధ్య దాగి ఉన్న సాలీడును కనుగొనాలి. అది కూడా 5 సెకన్లలో కనిపెట్టాలి. ఈ గమ్మత్తైన పజిల్ గేమ్‌పై ఒక్కసారి లుక్ వేయండి.

Optical Illusion: తోడేళ్ళ గుంపులో దాగున్న సాలీడు.. ఐదు సెకన్లలో గుర్తిస్తే మీరు తోపు..
Optical Illusion

Updated on: Sep 18, 2025 | 2:42 PM

ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ మన దృష్టిని, తెలివితేటలను సవాలు చేస్తాయి. చాలా మంది తమ తెలివితేటలను, దృష్టి తీక్షణత, పరిశీన శక్తిని సవాలు చేసే పజిల్ గేమ్‌లను ఆడటానికి ఇష్టపడతారు. అటువంటి వారు తమకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పజిల్ చిత్రాలపై ఓ లుక్ వేస్తారు. వీటిల్లో కొన్ని చిత్రాలు మెదడుకి పదును పెడతాయి. మెదడుకు వ్యాయామం ఇస్తాయి. అటువంటి వ్యక్తుల పరిశీలన శక్తిని సవాలు చేసే ఒక చిత్రం వైరల్ అయింది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో తోడేళ్ల గుంపు మధ్య , ఎనిమిది కాళ్ల కీటకం సాలీడు దాగి ఉంది. మీరు 5 సెకన్లలోపు కనిపెడితే మీ పరిశీలన శక్తి అమోఘం.. మీ చూపు డేగ చూపు అని అర్ధం..

సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?

ఆప్టికల్ భ్రమలు అనేవి మనసును ఆకట్టుకునే చిత్రాలు. ఇవి మీ ఆలోచన శక్తికి పదును పెడతాయి. మెదడుకు వ్యాయామం ఇస్తాయి. ఈ చిత్రంలో దాగి ఉన్న విషయాలను కనుగొనే సమయంలో పడే తపన.. ఎలాగైనా సాధించాలనే కోరిక మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న తోడేళ్ళ మధ్య దాగి ఉన్న సాలీడు చిత్రంలోని సవాల్ ని అతి తక్కువ మంది మాత్రమే సాల్వ్ చేశారు. మీరు ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే.. మీ సమయం ఇప్పుడే ప్రారంభమవుతుంది.

మీకు ఒక టిప్..

ఈ చిత్రాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసినా.. తోడేళ్ళ మధ్య దాక్కున్న సాలీడును మీరు గమనించకపోతే.. మీకు ఒక టిప్.. అది ఏమిటంటే.. ఈ ఫోటోలోని దిగువన జాగ్రత్తగా చూడండి. అక్కడ ఒక సాలీడు దాక్కుంది. ఇప్పుడు చాలా మందికి సాలీడు ఎక్కడ ఉందో అర్థమై ఉంటుంది. ఈ క్లూ వల్ల కూడా సాలీడుని కనిపెట్టలేక పొతే.. చింతించకండి. సమాధానంగా ఒక చిత్రాన్ని ఇస్తున్నాం.. అందులో సాలీడు ఉన్న చోటుని ఎరుపు రంగులో గుర్తించాము.

ఇవి కూడా చదవండి

Optical Illusion 1

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..