ఉల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!
ఉల్లిపాయను వంటల్లోనే కాకుండా ఎన్నో ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఆరోగ్య పరంగా, అందాన్ని మెరుగుపరచడంలో, నిత్యజీవిత సమస్యల్ని పరిష్కరించడంలో ఉల్లిపాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది రుచిని మాత్రమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేసే పోషకాలను అందిస్తుంది. దగ్గు, జలుబు నుంచి జుట్టు సంరక్షణ వరకూ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
Updated on: Feb 07, 2025 | 8:47 PM

వంట చేసేటప్పుడు కొన్ని సార్లు ఆహారం మాడిపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. దీన్ని తొలగించేందుకు చిన్న చిట్కా ఉంది. ఉల్లిపాయ ముక్కలను స్టవ్ దగ్గర ఉంచితే అవి మాడిన వాసనను గ్రహించి ఇంట్లో హాస్పిటాలిటీ వాతావరణాన్ని తీసుకువస్తాయి.

చాలా మంది ముఖంపై మొటిమలతో ఇబ్బందిపడతారు. ఈ సమస్యను తగ్గించేందుకు ఉల్లిపాయ సహాయపడుతుంది. ఉల్లిపాయ ముక్కను మొటిమ ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా రుద్దాలి లేదా రాత్రంతా ఉంచి ఉదయాన్నే కడిగేయాలి. ఇందులోని సల్ఫర్ కణజాలాన్ని శుభ్రపరిచి, మొటిమల్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే ఉల్లిపాయ రసాన్ని లేదా ఉల్లిపాయ నూనెను జుట్టుకు అప్లై చేయండి. ఇందులోని సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలంగా మార్చి పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

మనలో చాలా మందికి దగ్గు, జలుబు సమస్యలు ఎక్కువగా వస్తాయి. మందులు వాడినా సరైన ఫలితం కనిపించకపోతే ఉల్లిపాయను ట్రై చేయవచ్చు. ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి మంచం దగ్గర ఉంచితే నిద్రలో శ్వాస తీసుకునే సమయంలో ఉల్లిపాయ వాసన సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి ఉంటే ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

కొత్తగా ఇంటికి రంగు వేయించిన తర్వాత కొన్ని రోజులు దాని వాసన అసహనంగా ఉంటుంది. దీన్ని తొలగించేందుకు నాలుగు ఉల్లిపాయలను ముక్కలుగా కోసి గదిలో ఉంచితే వాసన తగ్గిపోతుంది.

కారు గ్లాస్‌పై మంచు పేరుకుపోయి డ్రైవింగ్ కష్టంగా మారుతుంది. దీని కోసం రాత్రిపూట ఉల్లిపాయ ముక్కలను కారు విండోపై రుద్దితే మంచు పేరుకోకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.





























