Dark Circles : ప్రస్తుతం యువతను వేదిస్తోన్న సమస్య బ్లాక్ హెడ్స్. ముఖంపై నల్లగా చిన్న చిన్న మచ్చలను బ్లాక్ హెడ్స్ అంటారు. అయితే ఇవి అమ్మాయిలలో మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇక వీటిని తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక తప్పక డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటుంటారు. బ్లాక్ హెడ్స్ రావడానికి కారణం ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన విధానం, ఎక్కువగా స్క్రీన్ చూడడం, సరైన నిద్ర లేకపోవడం కారణాలు. ఇవి వచ్చినప్పుడు కళ్లు లోపలికి వెళ్ళినట్లుగా చుట్టూ నలుపు రంగులోకి చర్మం మారుతుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రోహిల్ పాటిల్ అన్నారు. మీరు రోజూ తీసుకునే డైట్లో కొన్ని రకాల మార్పులు చేయడం వలన వీటిని నియంత్రించవచ్చని తెలిపారు. మరీ అవెంటో తెలుసుకుందామా.
మీ రెగ్యులర్ డైట్లో సరైన పోషకపదార్థాలను చేర్చడం వలన కళ్ళ కింద వచ్చే నలుపు రంగు, వాపు తగ్గుతాయని తెలిపారు. సరైన నిద్ర లేకపోవడం.. రాత్రి సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూడడం వంటివి చేయడం వలన ఈ సమస్య తీవ్రతరమవుతుందని.. అలాకాకుండా డిజిటల్ స్క్రీన్ కు దూరంగా ఉండడం, రాత్రిళ్ళు సరైన నిద్రపోయే విధంగా చూసుకోవాలని తెలిపారు.
జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే టీకి దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం నలన కళ్ళు ఉబ్బినట్లు, కళ్ళ కింద చర్మం నల్లగా మారుతుందని రోహిణి అన్నారు. స్వీట్లు, జిడ్డుగా ఉండే ఆహారపదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. వీటికి బదులుగా పండ్లు, ఆకుకూరలను మీ రోజూ వారి డైట్ లో చేర్చుకోవాలి.
సాల్టీ ఫుడ్ తీసుకోవడం వలన కళ్లు దగ్గర నల్లగా మారాడం.. వాపు రావడం జరగుతుంది. సాల్టీ ఫుడ్ తీసుకోకుండా ఉండడం. అలాగే మద్యం సేవించడం తగ్గించాలవి. వీటికి దూరం ఉండడం వలన బ్లాక్స్ హెడ్స్ నియంత్రించవచ్చు.
శరీరానికి నీటి శాతం అధికంగా ఉండాలి. ఇందుకు రోజు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. కళ్ళ మీద చల్లటి దోసకాయ ముక్కలు పెట్టుకోవడం వలన కళ్ళలో ఉండే వేడిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వాటి చుట్టూ ఉండే బ్లాక్ హెడ్స్ ను నియంత్రించవచ్చు.
మల్టీ విటమిన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను మీ డైట్ లో జోడించండి. ఎక్కువగా విటమిన్స్, కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడంవలన బ్లాక్ హెడ్స్ నివారించవచ్చు. ఐరన్, విటమిన్ సీ, బీ, ఈ ఎక్కువగా తీసుకోవాలి.
Also Read:
మీకు డయాబెటిస్ వచ్చిందని సందేహపడుతున్నారా ? ఈ లక్షణాలు మీలో ఉన్నాయెమో ఒకసారి చెక్ చేసుకోండి..