AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ కష్టాలు ఇంతలా ఉంటాయా..? కంటతడి పెట్టిస్తోన్న వైరల్‌ వీడియో..

అమెరికాలోని లాస్‌ వేగాస్‌ ప్రాంతానికి చెందిన ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన సెల్ఫీ వీడియో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇంతకీ ఆ బాయ్‌ పోస్ట్‌ చేసిన వీడియో ఏంటనేగా.. వివరాల్లోకి వెళితే..

Viral Video: ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ కష్టాలు ఇంతలా ఉంటాయా..? కంటతడి పెట్టిస్తోన్న వైరల్‌ వీడియో..
Narender Vaitla
|

Updated on: Feb 26, 2021 | 2:12 PM

Share

Food Delivery Boy Emotional Video: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ అయిపోయింది. ఒకప్పుడు రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే రడీ అయ్యి, ఇంటి నుంచి రెస్టారెంట్‌ ఉన్న ప్రదేశానికి ప్రయాణం చేసి, కారు లేదా బైక్‌ పార్కింగ్‌ చేసి, టేబుల్‌ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి.. ఇలా పెద్ద తతంగం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంట్లోనే కూర్చుని నచ్చిన రెస్టారెంట్‌ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకొని ఎంచక్క ఇంట్లో టీవీ చూస్తూ తినేస్తున్నాం. ఫుడ్‌ డెలివరీ సేవలు పెరగడం, ఇంటి వద్దకే ఆహారాన్ని తీసుకొచ్చే ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ కూడా ఉండడంతో ఈ పని మరింత సులువగా అయిపోయింది. అయితే మనం ఏదైనా రెస్టారెంట్‌లో ఫుడ్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కాస్త ఆలస్యం చేసినా అతనిపై కోపంతో ఊగిపోతుంటాం.. ఇంత లేటా..? అడ్రస్‌ ఒక్కసారి చెబితో అర్థం చేసుకోలేవా.. అంటూ అప్పుడప్పుడు అసహనం వ్యక్తం చేస్తుంటాం. అయితే వారికీ కష్టాలు ఉంటాయని మీకు తెలుసా.? తాజాగా అమెరికాలోని లాస్‌ వేగాస్‌ ప్రాంతానికి చెందిన ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన సెల్ఫీ వీడియో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇంతకీ ఆ బాయ్‌ పోస్ట్‌ చేసిన వీడియో ఏంటనేగా.. వివరాల్లోకి వెళితే.. లాస్‌వేగాస్‌కు చెందిన ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఇటీవల ఒక ఆర్డర్‌ను ఇవ్వడానికి కస్టమర్‌ వద్దకు వెళ్లాడు కానీ.. కస్టమర్‌ ఎంతకీ కిందికి రాకపోవడంతో 45 నిమిషాలు ఎదురుచూశాడు. దీంతో అతని వాహనం పార్కింగ్‌ ఫీజుగా మూడు డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. తీరా ఆర్డర్‌ తీసుకున్న తర్వాత సదరు కస్టమర్‌.. డెలివరీ బాయ్‌కి 1.50 డాలర్‌ టిప్పుగా ఇచ్చాడు, ఫుడ్‌ డెలివరీ చేసినందుకు సదరు ఫుడ్‌ డెలివరీ సంస్థ అతనికి 2.50 డాలర్లు ఇచ్చింది. ఈ లెక్కన ఆ వ్యక్తికి ఆ ఆర్డర్‌లో మిగిలింది కేవలం ఒక డాలర్‌ మాత్రమే. కానీ అతనికి పెట్రోల్‌ రూపంలో అంతకంటే ఎక్కువ ఖర్చు అయింది. ఈ విషయన్నే సదరు ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సెల్ఫీ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘నేను సంపాదిస్తున్న దాంట్లో ఇలా సగానికిపైగా పోతుంటే నేను బతికేది ఎలా.? కస్టమర్లు తమ డెలివరీ బాయ్స్‌కు సరిపడ టిప్‌ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కరోనాలాంటి ప్యాండమిక్‌ పొంచి ఉన్న పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి పని చేస్తుంటే మమ్మల్ని పట్టించుకునే వారు లేకపోవడం చాలా బాధగా ఉంది.’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నవ్యుతూ ఫుడ్‌ డెలివరీ అందించే బాయ్స్‌ వెనక ఇంతటి కష్టం ఉంటుందా.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఫుడ్ డెలివరీ బాయ్ కన్నీటి పర్యంతం అవుతూ చేసిన సెల్ఫీ వీడియో..

Also Read: Weight Loss Best Food: లేట్ నైట్ ఈ స్నాక్స్ తింటున్నారా ? అయితే బరువు పెరిగే ఛాన్స్.. బెస్ట్ స్నాక్స్ ఏమిటంటే..

Dandruff Tips: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ ట్రిక్స్ ఫాలో అయితే రిజల్ట్ పక్కా…

Thala Ajith Cycling Photos: హైదరాబాద్‌లో అదిరిపోయే లుక్ లో కెమెరా కంట పడ్డ తల’ అజిత్ కుమార్’