AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ముక్కు నుంచి రక్తం వస్తుందా.? ఈ సమస్యకు లక్షణం కావొచ్చు..

ప్రస్తుతం అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బీపీ బారిన పడుతున్నారు. అయితే అధిక రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు...

Lifestyle: ముక్కు నుంచి రక్తం వస్తుందా.? ఈ సమస్యకు లక్షణం కావొచ్చు..
Lifestyle
Narender Vaitla
|

Updated on: Mar 17, 2024 | 7:32 PM

Share

ప్రస్తుతం అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బీపీ బారిన పడుతున్నారు. అయితే అధిక రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ రక్తపోటును ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* అధిక రక్తపోటు ముక్కు నుంచి రక్తస్రావం కలిగిస్తుంది. రక్తపోటు పెరిగినప్పుడు, నాసికా సిరలపై ఒత్తిడి పడుతుంది ఇది సిరలు చితిలిపోవడానికి కారణమవుతుంది. దీని కారణంగా ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది. ఈ ముక్కు నుండి రక్తస్రావం అధిక రక్తపోటు తీవ్రమైన లక్షణంగా నిపుణులు చెబుతున్నారు.

* అధిక రక్తపోటు లక్షణాల్లో తలనొప్పి కూడా ఒకటి. బీపీ పెరిగిన వెంటనే కనిపించే లక్షణాల్లో తలనొప్పి ప్రధానమైందని నిపుణులు సూచిస్తున్నారు.

* ఇక కొన్ని సందర్భాల్లో బీపీ పెరగానే మైకం వంటి లక్షణం కూడా కనిపిస్తుంది. కళ్లు తిరిగినట్లు అనిపించిన వెంటనే బీపీ పరీక్షలు నిర్వహించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* ఉన్నట్లుండి బీపీ పెరిగితే చెవుల్లో రింగ్‌ శబ్ధమైనట్లు వినిపిస్తుంది. ఇది కూడా బీపీకి ప్రాథమిక లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు ఎక్కువ అయినప్పుడు, రక్త నాళాలలో రక్తం చాలా వేగంగా ప్రవహిస్తుంది. దీంతో చెవిలోని నరాలు, రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. ఈ పీడనం చెవిలోపల ఎముకలు, నరాలను ప్రభావితం చేస్తుంది దీనివల్ల ‘రింగింగ్’ లేదా టింక్లింగ్ శబ్దం వస్తుంది.

* బీపీ పెరిగిన వెంటనే శరీరంలోని రక్త నాళాలు, సిరలు ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు. ఊపిరితిత్తులు మన శరీరంలోని శ్వాసక్రియకు బాధ్యత వహిస్తాయి. ఊపిరితిత్తులకు తక్కువ ఆక్సిజన్ వచ్చినప్పుడు, సాధారణం కంటే ఎక్కువగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..