గుట్టుగా దాంపత్యం..ఆంధ్రప్రదేశ్‌లో దుర్భరం

దక్షిణాది రాష్ట్రాల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. ఇరుకైన ఇంట్లో కుటుంబ సభ్యులంతా సర్దుకుపోయి జీవిస్తుంటారు. ఇక ఫ్యామిలీలో ఎవరికైనా పెళ్లయితే..భాగస్వామితో కాస్త మనసువిప్పి మాట్లాడుకునే ప్రైవసీ ఉండదు. ఇక దాంపత్య జీవితం గురించి చెప్పేది ఏముంటుంది. హనీమూన్ లాంటి పదాలు తెలియని వాళ్లు అయితే కోకొల్లలు. ఇక వైవాహిక బంధాన్ని ఆస్వాదించేది ఎప్పుడు..?. ఈ ఇష్యూపై జాతీయ నమూనా సర్వే 2018 జులై-డిసెంబరు మధ్య సర్వే నిర్వహించి.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏపీలోని గ్రామీణ […]

గుట్టుగా దాంపత్యం..ఆంధ్రప్రదేశ్‌లో దుర్భరం
Follow us

|

Updated on: Nov 28, 2019 | 12:35 PM

దక్షిణాది రాష్ట్రాల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. ఇరుకైన ఇంట్లో కుటుంబ సభ్యులంతా సర్దుకుపోయి జీవిస్తుంటారు. ఇక ఫ్యామిలీలో ఎవరికైనా పెళ్లయితే..భాగస్వామితో కాస్త మనసువిప్పి మాట్లాడుకునే ప్రైవసీ ఉండదు. ఇక దాంపత్య జీవితం గురించి చెప్పేది ఏముంటుంది. హనీమూన్ లాంటి పదాలు తెలియని వాళ్లు అయితే కోకొల్లలు. ఇక వైవాహిక బంధాన్ని ఆస్వాదించేది ఎప్పుడు..?. ఈ ఇష్యూపై జాతీయ నమూనా సర్వే 2018 జులై-డిసెంబరు మధ్య సర్వే నిర్వహించి.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం కుటుంబాలు  కొత్తగా పెళ్లైన తర్వాత దాంపత్య జీవితాన్ని సరిగ్గా అనుభవించలేకపోతున్నారని సర్వే స్పష్టం చేసింది. అర్బన్ ప్రాంతాల్లో వీరు 29 శాతం వరకు ఉన్నారని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా..గుట్టుగా కాపురాన్ని వెళ్లదీయాల్సి వస్తోందని సర్వే సంస్థ అభిప్రాయపడింది. ఇక పెళ్లి తర్వాత..ప్రైవసీ లైఫ్‌ను లీడ్ చేస్తోన్న రాష్ట్రాల్లో కేరళ టాప్‌లో ఉంది. కేరళ విలేజస్‌లో  89 శాతం…అర్బన్ ప్రాంతాల్లో ఏకంగా 93 శాతం తమ దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ విషయంలో  దేశ వ్యాప్త సగటు, సౌత్‌లోని అన్ని రాష్ట్రాల సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉండటం గమనార్హం.