ఈ ఆయిల్‌ను అధికంగా వినియోగిస్తున్నారా? అయితే అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే! కొత్త అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు..
Soyabean Oil:సోయాబీన్ ఆయిల్ ను అధికంగా వినియోగించడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, ఆటిజమ్, అల్జీమర్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని గుర్తించారు. అలాగే అల్సరేటివ్ కొలిటిస్ అంటే ఇన్ ఫ్లమేషన్ బొవెల్ డిసీజ్(ఐబీడీ) వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా పెరుగుతోందని నిర్ధారించారు.

సోయాబీన్ తో చాలా ప్రయోజనాలున్నాయి. సోయాబీన్ ఆయిల్ ని కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో దీని వినియోగం చాలా అధికం. అయితే ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సోయాబీన్ ఆయిల్ ను అధికంగా వినియోగించడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, ఆటిజమ్, అల్జీమర్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని గుర్తించారు. అలాగే అల్సరేటివ్ కొలిటిస్ అంటే ఇన్ ఫ్లమేషన్ బొవెల్ డిసీజ్(ఐబీడీ) వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా పెరుగుతోందని నిర్ధారించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పరిశోధన ఇలా..
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ఎలుక పేగులను పరిశోధించారు. అధికంగా సోయాబీన్ ఆయిల్ వినియోగించిన ఆహార పదార్థాలను దానిని పెట్టి పేగుల్లో జరిగే పరిణామాలపై అధ్యయనం చేశారు. ఇది అధ్యయనం 24 వారాల పాటు కొనసాగింది. దీనిలో వారు కొన్ని ఆసక్తి కర అంశాలను గుర్తించారు. ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా తగ్గిపోతోందని.. చెడు చేసే బ్యాక్టీరియా ముఖ్యంగా అథెరెంట్ ఇన్ వ్యాసివ్ ఎస్చెరిచియా కొలి వంటివి పెరుగుతున్నాయని గమనించారు. ఇది కొలిటిస్(పెద్ద పేగు సమస్య)కు దారితీస్తుందని నిర్ధారించారు. వాస్తవానికి ఈ సోయాబీన్ ఆయిల్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విరివిగా వినియోగిస్తారు. అలాగే బ్రేజిల్, చైనా, ఇండియా వంటి దేశాలలో దీని వినియోగం క్రమంగా పెరుగుతోంది. అయితే యూఎస్ లో 1970లో ఈ సోయాబీన్స్ ను యానిమల్స్ కు అందించడానికి సోయాబీన్ ఆయిల్ వినియోగాన్ని నిలిపివేశారు. వాస్తవానికి సోయాబీన్స్ అనేవి మంచి ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఇది చాలా చీప్ గా దొరుకుతాయి. సులభంగా పెరుగుతాయి.
ఎందుకు హానికరం అంటే..
వాస్తవానికి మన శరీరం 1 నుంచి 2 శాతం నినోలీక్ యాసిడ్ ను వినియోగించుకుంటుంది. అయితే అమెరికాలోని ప్రజలు 8 నుంచి 10 శాతం నినోలీక్ యాసిడ్ ను పొందుతున్నారు. ఎందుకంటే వారు సోయాబీన్ ఆయిన్ ను వాడటం కారణంగా ఇది జరుగుతోంది. అయితే ఇలా అధికంగా ఉత్పత్తి అవుతున్న నినోలీక్ యాసిడ్ పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకుల బృందం కొనుగొంది. దీని కారణంగా బరువు పెరగడం, షుగర్ వంటి వ్యాధులు కూడా వస్తాయని చెబుతున్నారు.
మరి ఏ ఆయిల్ మంచిది..
సోయాబీన్ ఆయిల్ స్థానంలో ఆలివ్ ఆయిల్ వాడటం ఉత్తమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే లినోలీక్ యాసిడ్ ను తక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది మనిషి ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఈ ఆలివ్ ఆయిల్ అనేది ఒక మెడిటెర్రానియన్ డైట్.. ఇది చాలా ఆరోగ్యదాయకం. అంతేకాక కొబ్బరి నూనె, అవకాడో నూనెలను వినియోగించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



