AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health: లివర్ భద్రంగా ఉండాలా.? ఈ డ్రింక్స్‌ తాగండి..

శరీరంలో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిసిందే. అలాంటి లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లివర్‌ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే, రోజూ ఉదయాన్నే కొన్ని రకాల డ్రింక్స్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..

Liver Health: లివర్ భద్రంగా ఉండాలా.? ఈ డ్రింక్స్‌ తాగండి..
Liver
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 08, 2024 | 10:17 PM

Share

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా లివర్‌ పనితీరు మెరుగ్గా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీర్ణవ్యవస్థలో కాలేయం ముఖ్యపాత్రను పోషిస్తుంది. శరీరంలో అతిపెద్ద అవయవమైన కాలేయం పోషించే పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇటీవల మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఫ్యాటీ లివర్‌ వ్యాధితో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఫ్యాటీ లివర్‌ కారణంగా కడుపు నొప్పి మొదలు ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. అయితే లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని సహజ చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే కొన్ని రకాల డ్రింక్స్‌ను తీసుకుంటే లివర్ డీటాక్స్ అయ్యి కాలేయ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇంతకీ కాలేయాన్ని ఆరోగ్యాన్ని కాపాడే ఆ డ్రింక్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయానే ఖాళీ కడుపుతో నిమ్మరసం నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే లివర్‌ ఆరోగ్యం మెరుగుపుడుతుంది. నిమ్మరసంలోని విటమిన్‌ సి లివర్ డీటాక్స్ ఎంజైమ్స్‌ని ప్రేరేపించి పిత్త ఉత్పత్తికి సాయపడుతుంది. పిత్తం కాలేయంలోని కొవ్వుని విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బీట్‌రూట్ జ్యూస్‌ కూడా కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ లివర్ డీటాక్స్ చేస్తాయి. ఇక పసుపు కూడా కాలేయం ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తీసుకోవడం వల్ల లివర్‌ డీటాక్స్‌ అవుతుంది. పసుపులో కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డీటాక్సీఫైయర్ డ్రింక్‌లా పనిచేస్తాయి. పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

లివర్‌ ఆరోగ్యాన్ని రక్షించడంలో గ్రీన్‌ టీ కూడా బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్‌ టీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది లివర్ దెబ్బతినకుండా, డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందుకోసం రోజూ ఒకటి, రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే లివర్ హెల్త్‌కి మంచిది. వీటితో పాటు కూల్‌డ్రింక్స్‌, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వల్ల కూడా లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..