Nail Biting Habit: గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసా..

|

May 06, 2024 | 9:36 AM

కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు గోర్లను గబగబా కొరికేస్తూ ఉంటారు. ఈ అలవాటు గోళ్ల ఆకృతిని పాడుచేయడమే కాకుండా..  అనేక ఇతర ఆరోగ్య, చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఈ చెడు అలవాటుతో ఆరోగ్యం దెబ్బతింటుంది. గోరు కొరకడం అనేది ఒక అలవాటు. దీని కారణంగా శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. కనుక  ఈ అలవాటుకు బై-బై చెప్పడం చాలా ముఖ్యం. ఇది కష్టమైనప్పటికీ, అసాధ్యం కాదు. గోళ్లు కొరికే అలవాటు వల్ల ఎలాంటి హాని కలుగుతుందో  ఈ రోజు తెలుసుకుందాం.

Nail Biting Habit: గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసా..
Nail Biting Habit
Follow us on

గోళ్లు కొరికే అలవాటు చిన్నతనంలో ఉంటె పెద్దలు ఆ అలవాటు మంచిది కాదంటూ తిడతారు. అయితే గోళ్లను కోరిక అలవాటు చిన్న పిల్లల్లో మాత్రమే కాదు కొందరి పెద్దవారిలో కూడా కనిపించే అలవాటు. కొంతమంది ఖాళీగా కూర్చున్నప్పుడు గోర్లు కొరకడం ప్రారంభిస్తారు. అయితే కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు గోర్లను గబగబా కొరికేస్తూ ఉంటారు. ఈ అలవాటు గోళ్ల ఆకృతిని పాడుచేయడమే కాకుండా..  అనేక ఇతర ఆరోగ్య, చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఈ చెడు అలవాటుతో ఆరోగ్యం దెబ్బతింటుంది.

గోరు కొరకడం అనేది ఒక అలవాటు. దీని కారణంగా శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. కనుక  ఈ అలవాటుకు బై-బై చెప్పడం చాలా ముఖ్యం. ఇది కష్టమైనప్పటికీ, అసాధ్యం కాదు. గోళ్లు కొరికే అలవాటు వల్ల ఎలాంటి హాని కలుగుతుందో  ఈ రోజు తెలుసుకుందాం.

స్కిన్ ఇన్ఫెక్షన్ : నిరంతరం గోళ్లను కొరకడం వల్ల గోరు చుట్టూ ఉండే చర్మం దెబ్బతినడం మొదలవుతుంది. అంతేకాదు చర్మంలో పీచులు కనిపించడం, గాయాలు వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. చూడగానే చాలా అపరిశుభ్రంగా చూపరులకు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

కడుపు సంబంధిత సమస్యలు: గోర్లు నమలినప్పుడు నోటి నుండి బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశిస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. ఈ అలవాటు వల్ల మీకు మళ్లీ మళ్లీ విరేచనాలు, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.

దంతాల, చిగుళ్ళకు సంబంధిత సమస్య: గోళ్లు కొరికే అలవాటు నోటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది బ్రక్సిజం అనే వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతుంది. వాస్తవానికి ఈ సమస్య సాధారణంగా దంతాలు గట్టిగా బిగించడం, గ్రైండింగ్, మందులు తీసుకోవడం మొదలైన వాటి కారణంగా సంభవిస్తుంది. అదే సమయంలో, నిరంతరం గోర్లు కొరికే అలవాటు కూడా ఈ వ్యాధి అవకాశాలను పెంచుతుంది.

మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురికావచ్చు: గోళ్లలో పేరుకుపోయిన మురికిలో అనేక రకాల బ్యాక్టీరియాలు పెరగడం ప్రారంభిస్తాయి. గోళ్లను పళ్ళతో కొరికినప్పుడు ఆ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది.దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది . మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..