చిట్టివేగానీ మహా గట్టివి..! పోషకాలు..లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండోయ్..

ఆవాలు లేని పోపును అస్సలు ఊహించలేం. ఇక పచ్చళ్లలో, ఆవకాయల్లో ఆవాలు పాత్ర ఇంతా అంతాకాదు. చాలా రకాల కూరలు ఆవపిండితో కలిపి వండుతారు. ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో బీపి కంట్రోల్ ఉంటుంది. శరీరంలో గుడ్ కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

చిట్టివేగానీ మహా గట్టివి..! పోషకాలు..లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండోయ్..
Mustard Seeds

Updated on: Oct 29, 2025 | 2:09 PM

ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి కొవ్వులు పెరుగుతాయి. కేన్సర్‌కు చెక్‌ చెప్పే గుణాలు కూడా ఆవాల్లో ఉన్నాయి. ఆవపిండిలో సెలీనియం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఉబ్బసం లేదా శ్వాసకోశ సమస్యలకు, శ్వాసకోశంలో మంట నివారణకు ఉపయోగపడుతుంది. ఆవాల్లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉబ్బరం, అజీర్ణంతో బాధపడేవారు భోజనంలో ఆవపిండిని చేర్చుకోవచ్చు. పొటాషియం, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలుకు ఉపశమనం లభిస్తుంది.

ఆవాల్లోని రిచ్ న్యూట్రియెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. జుట్టుని బలంగా చేస్తాయి. ఇందులో విటమిన్ ఎ, కె, సిలు చర్మం ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి. ఆవపిండిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. అలాగే ఇందులోని సల్ఫర్ చర్మంపై మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లను దరి చేరకుండా నివారిస్తుంది.

సోరియాసిస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్, రింగ్ వార్మ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. ఆవాల నూనెను పూయడం వల్ల గాయాలు వేగంగా నయం అవుతాయి. ఆవనూనె కూడా చాలా రకాల ఔషధ ప్రయోజనాలకోసం వాడతారు. ఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనెను కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్‌లపై చల్లుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..