
మునగలో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి.. మునగ మొక్క, వేర్లు, మునక్కాయలు, ఆకులు, పువ్వులు అన్నీ పవర్‌ఫులే.. అందుకే.. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దాదాపు అన్ని సీజన్లలో లభించే.. మునగలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.. మునగకాయ, మునగ ఆకులు.. దేనికదే ప్రసిద్ధి.. వీటిని సూప్ గా లేదా.. కూరగా, పప్పులో వేసుకుని తినవచ్చు.. ఇంకా జ్యూస్ గా కూడా తాగొచ్చు.. మునగాకులను ఆయుర్వేదం ప్రకారం.. తీసుకుంటే.. ఎన్నో సమస్యలను దూరం చేయొచ్చంటున్నారు నిపుణులు.. మునగ మొక్క దాని వేర్ల నుండి పువ్వుల వరకు ఔషధ గుణాలతో నిండిన మొక్క అని.. ఇది అనేక వ్యాధులను సులభంగా నయం చేయగలదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అయితే.. మునగ ఆకులను పోషకాల పవర్‌హౌస్ గాపిలుస్తారు. కేవలం 100 గ్రాముల మునగాకులలో నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఈ ఆకు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. మునగాకులలో మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్లు K, E కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. కేలరీలు ఉండవని పేర్కొంటున్నారు.
టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుంటే మునగ మొక్క వేర్లను నీటిలో మరిగించి తాగితే ఫలితాలు కనిపిస్తాయి.
తీవ్రమైన తలనొప్పి ఉంటే మునగాకులను బాగా నలిపి తలకు పట్టిస్తే తలనొప్పి క్రమంగా తగ్గిపోతుంది.
మునగ మొక్క వేరు ఆరోగ్యానికి చాలా మంచిది.. మీకు గొంతు నొప్పి ఉంటే, మీరు దాని వేళ్ళతో కషాయం తయారు చేసి, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పుక్కిలించవచ్చు.
మీరు దాని ఆకులను నమలడం ద్వారా మీ చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.
మీరు శారీరక బలహీనతతో బాధపడుతుంటే, ఈ మునగ మొక్క పువ్వులను నీటిలో మరిగించి త్రాగవచ్చు. ఇది ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇది మాత్రమే కాదు, ఈ మునగాకు శరీరం లోపల కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుందని పేర్కొంటున్నారు.
మీరు ఏమైనా సమస్యతో బాధపడుతుంటే ముందుగా వైద్యులను సంప్రదించడం మంచింది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..