Health Care Tips: ఏది ఉన్నా లేకపోయినా లేకపోయినా చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే మాత్రం ఆగమాగం అయిపోతారు జనాలు. ఒక్క నిమిషం ఫోన్ లేకపోతే.. ప్రాణమే పోయినట్లుగా ఫీలవుతుంటారు. చిన్న పిల్లలు మొదలు.. పెద్ద వాళ్ల వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇక ఏదైనా కారణం చేత ఇంటర్నెట్ కాసేపు షట్ డౌన్ అయితే.. యావత్ ప్రపంచం ఉలిక్కిపడుతుంది. అలా ఉంది పరిస్థితి. ఈ సంగతి ఇలా ఉంటే.. చాలా మంది ఉదయం నిద్ర లేచించి మొదలు.. అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్లను వాడుతుంటారు. మొబైల్ వాడకానికి అడిక్ట్ అవుతుంటారు. ఇంకొందరు నిద్ర లేవగానే మొబైల్ ఫోన్‌ను చూస్తారు. కానీ, ఇది మంచిది కాదు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కంటి ఆరోగ్యంతో పాటు.. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందంటున్నారు.
తాజాగా పరిశోధనలో ఉదయాన్నే మొబైల్ ఫోన్ చూసే వారికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఏదో ఘటన చోటు చేసుకుంటుంది. మంచి కానీ, చెడు కానీ.. మొబైల్‌కు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్‌ని చాలా మంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే చెక్ చేస్తుంటారు. అయితే, అందులో వచ్చే నోటిఫికేషన్స్, చెడు వార్తలు రోజంతా డిస్ట్రబ్ చేస్తాయి. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక కొందరు నిద్రలేచిన వెంటనే సమయం చూడటం, లేదా అలారం ఆపడం చేస్తుంటారు. ఇది కూడా వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం లేవగానే ఫోన్‌ని చెక్ చేసే బదులుగా పడక టేబుల్‌పై గడియారాన్ని ఉంచుకోవడం ఉత్తమం. అలారం గడియారాన్ని కొనుగోలు చేస్తే ఇంకా మేలు. అలాగే ఫోన్‌లో సోషల్ మీడియా నోటిఫికేషన్లను చెక్ చేయకుండా.. మంచి పుస్తకం, న్యూస్ పేపర్, ఏదైనా మ్యాగజైన్ చదవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా కొత్త విషయాలు నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా విజ్ఞానం పెంచుకోవచ్చు.
నిద్రలేచిన తరువాత రోజువారీ కాలకృత్యాలు తీర్చుకుని, ధ్యానం చేయాలి. తద్వారా మనస్సు రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇష్టమైన వారితో ఉదయం కాసేపు మాట్లాడాలి. రోజుకు సంబంధించిన పనులను నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇతర ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం మంచిది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచేందుకు దోహదపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..