మహిళలు Vs పురుషులు.. ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే..

వివాహేతర సంబంధాల్లో పురుషులు, స్త్రీలు ఎవరు ఎక్కువగా మోసం చేస్తారనే చర్చకు విడాకుల న్యాయవాది సెక్స్టన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. పురుషులు ఎక్కువగా మోసం చేసినా, స్త్రీలు తెలివిగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. మోసానికి గల కారణాలు, బయటపడినప్పుడు వారి స్పందనలు, మోసాన్ని దాచే విధానాలు భిన్నంగా ఉంటాయని విశ్లేషించారు.

మహిళలు Vs పురుషులు.. ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే..
Men Vs Women

Updated on: Dec 12, 2025 | 11:51 AM

వివాహేతర సంబంధాల విషయంలో పురుషులు లేదా స్త్రీలు ఎవరు ఎక్కువగా మోసం చేస్తారనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. అయితే విడాకుల న్యాయవాదులు మాత్రమే వినే కథల్లో ఈ ప్రశ్నకు అసలు సమాధానం దాగి ఉంటుంది. న్యూయార్క్ కుటుంబ, విడాకుల చట్ట న్యాయవాది జేమ్స్ జోసెఫ్ సెక్స్టన్, తన అనుభవాన్ని బట్టి పురుషులు లేదా స్త్రీలు ఎవరు ఎక్కువగా మోసం చేస్తారో వివరించారు. అతని ప్రకారం.. సమాధానం ప్రజలు అనుకున్నంత సూటిగా ఉండదు. ఇది కేవలం లింగంపై మాత్రమే కాకుండా సంబంధంలో ఉన్న భావోద్వేగ దూరం, నిశ్శబ్దం వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని ఆయన అంటున్నారు.

సెక్స్టన్ ప్రకారం.. పురుషులు ఎక్కువగా మోసం చేస్తారు. కానీ స్త్రీలు తెలివిగా మోసం చేస్తారు. దీని అర్థం ఏమిటంటే.. స్త్రీలు ఏదైనా చేయాలనుకుంటే అది పూర్తి ప్రణాళికతో ఉంటుంది. పురుషులు తరచుగా ఆలోచించకుండా తెలివితక్కువ పనులలో చిక్కుకుంటారు. మోసానికి గల కారణాల విషయానికి వస్తే చాలా మంది పురుషులు భావోద్వేగ సంబంధం లేకపోవడం వల్ల మోసం చేస్తారు. అయితే చాలా మంది మహిళలు సంబంధంలో తాము చెప్పేది వినబడకపోవడం లేదా అర్థం చేసుకోకపోవడం వల్ల మోసం చేస్తారని న్యాయవాదులు అంటున్నారు.

న్యాయవాది సెక్స్టన్ ప్రకారం.. మోసం అనేది రెండు రకాలుగా ఉంటుంది. కేవలం ఎవరితోనైనా సరదాగా గడపడం లేదా చిన్న పొరపాటు చేయడం వంటి వాటిని లైట్ తీసుకోవచ్చు. ఒక వ్యక్తి మరొకరితో చాలా కాలం పాటు ఎమోషనల్‌గా దగ్గరవడం, ఎఫైర్ పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు.తన భాగస్వామి మోసం చేశారని తెలిసినప్పుడు స్త్రీలు, పురుషులు భిన్నమైన ప్రశ్నలు అడుగుతారు. ఒక భర్త తన భార్య మోసం చేసిందని తెలుసుకుంటే, అతడు ఎక్కువగా శారీరక విషయంపై దృష్టి పెడతాడు. ఉదాహరణకు, “మీరు అతడితో శారీరక సంబంధం పెట్టుకున్నారా?” అని అడుగుతారు. ఒక భార్య తన భర్త మోసం చేశాడని తెలుసుకుంటే.. ఆమె ఎక్కువగా భావోద్వేగాల గురించి ఆలోచిస్తుంది. ఉదాహరణకు.. మీరు ఆమెను ప్రేమిస్తున్నారా? అని అడుగుతుంది. ఈ తేడాను బట్టి చూస్తే, మగవారు తమ ‘హక్కు’ పోయిందని భావిస్తే, ఆడవారు తమ ‘ప్రేమ స్థానం’ పోయిందని ఆందోళన చెందుతారని అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఎవరు ఎక్కువగా పట్టుబడతారనే విషయం కూడా ఆసక్తికరమైనదే.. ఇటువంటి వ్యవహారాల్లో పురుషులు పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మహిళలు మోసాన్ని దాచడంలో మరింత తెలివిగా, జాగ్రత్తగా ఉంటారని సెక్స్టన్ తేల్చి చెప్పారు. సంబంధాలు విచ్ఛిన్నం కావడం సంవత్సరాల తరబడి చూసిన తర్వాత, న్యాయవాది సెక్స్టన్ చెప్పేది ఒకటే.. పురుషులు – మహిళలు ఇద్దరూ మోసం చేస్తారు.. కానీ వారి పద్ధతులు, కారణాలు, వారు దానిని దాచే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..