చాలా మంది గుడ్లను వండే ముందు కడుగుతుంటారు. అయితే, ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లపై ఉండే సహజమైన బ్లూమ్ పొర బ్యాక్టీరియాను లోపలికి వెళ్లనివ్వదు. కడగడం వల్ల ఈ పొర తొలగిపోయి, గుడ్లు త్వరగా పాడవడమే కాకుండా అనారోగ్యానికి దారితీయవచ్చు.