పొద్దున్నే టీతో బిస్కెట్లు తినే అలవాటు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్కెట్లలో రిఫైన్డ్ ఫ్లోర్, చక్కెరలు, ప్రాసెస్డ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి పోషకాలు లేకుండా బరువు పెంచడంతో పాటు అజీర్తి, గ్యాస్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఈ అలవాటును మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.