AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు ఎన్ని పెళ్లిళ్లు అవుతాయి.. ఏ వయసులో అవుతాయి..? మీ చేతిలోని రహస్యాలను ఇలా తెలుసుకోండి..

మీ పెళ్లి ఎప్పుడు..? మీ భాగస్వామితో మీ బంధం ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతున్నారా? అయితే ఆగండి.. మీ భవిష్యత్తు మీ అరచేతిలోనే ఉంది.. చిటికెన వేలు కింద ఉండే ఆ చిన్న గీత మీ జీవిత రహస్యాలన్నింటినీ దాచి ఉంచిందని మీకు తెలుసా?

మీకు ఎన్ని పెళ్లిళ్లు అవుతాయి.. ఏ వయసులో అవుతాయి..? మీ చేతిలోని రహస్యాలను ఇలా తెలుసుకోండి..
Marriage Line Palmistry
Krishna S
|

Updated on: Mar 23, 2026 | 9:01 PM

Share

నాకు పెళ్లెప్పుడు అవుతుంది? నా జీవిత భాగస్వామి ఎలా ఉంటారు? మా సంసారం సంతోషంగా సాగుతుందా? ఈ ప్రశ్నలు అడగని వారు, జ్యోతిష్యులను ఆశ్రయించని వారు ఉండరు. అయితే మీ భవిష్యత్తును ఎవరో చెప్పక్కర్లేదు, మీ అరచేతిని చూసి మీరే తెలుసుకోవచ్చని మీకు తెలుసా? సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మన చిటికెన వేలు కింద ఉండే వివాహ రేఖ మన వైవాహిక జీవితానికి అద్దం పడుతుంది.

మూడు గీతలు ఉంటే మూడు పెళ్లిళ్లా?

చాలా మంది అరిచేతిలో రెండు మూడు గీతలు చూడగానే.. నాకు ఇన్ని పెళ్లిళ్లు అవుతాయా? అని కంగారు పడిపోతుంటారు. కానీ హస్తసాముద్రికం ప్రకారం.. అది నిజం కాదు. ఆ గీతలు మీ జీవితంలో ఏర్పడే గాఢమైన ప్రేమ అనుబంధాలను లేదా బలమైన భావోద్వేగాలను కూడా సూచిస్తాయి. రెండు గీతలు సమానంగా, లోతుగా, సమాంతరంగా ఉంటేనే ఒకటి కంటే ఎక్కువ వివాహాలకు అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

పెళ్లెప్పుడు? 25లోనా.. 30 దాటాకా?

మీ వివాహం త్వరగా అవుతుందా లేక ఆలస్యమవుతుందా అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న లెక్క ఉంది. హృదయ రేఖ నుండి చిటికెన వేలు మొదలు వరకు ఉన్న దూరాన్ని 50 ఏళ్లుగా పరిగణిస్తారు.

మధ్యలో ఉంటే: 25 నుండి 27 ఏళ్ల మధ్య వివాహం జరుగుతుంది.

హృదయ రేఖకు దగ్గరగా ఉంటే: చాలా చిన్న వయసులోనే పెళ్లి అయ్యే అవకాశం ఉంది.

చిటికెన వేలు వైపు వంగి ఉంటే: 30 ఏళ్లు దాటిన తర్వాతే వివాహ ఘడియలు వస్తాయని అర్థం.

శుభ సంకేతాలు – హెచ్చరికలు:

స్పష్టంగా, ఎరుపు రంగులో ఉంటే: మీ వైవాహిక జీవితం అద్భుతంగా, సుఖసంతోషాలతో సాగుతుంది.

ద్వీపం ఉంటే: బంధంలో పెద్ద అడ్డంకులు లేదా ఎడబాటు వచ్చే సూచన.

క్రిందికి వంగి హృదయ రేఖను తాకితే: భాగస్వామి అనారోగ్యం లేదా తీవ్ర దుఃఖాన్ని సూచిస్తుంది.

క్రాస్ లేదా పుట్టుమచ్చ: వివాహంలో ఆకస్మిక ఎదురుదెబ్బలకు సంకేతం.

చేతి రేఖలు కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే. రేఖలు ఎలా ఉన్నా, మన ఆలోచనలు, మనస్తత్వం, చేసే పనులే మన విధిని మారుస్తాయి. కాబట్టి గీతలను చూసి భయపడకుండా, నమ్మకంతో ముందడుగు వేయడమే వివేకం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us