Beetroot Benefits: బీట్‌రూట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ రోగులకు దివ్యఔషధమే..

బీట్‌రూట్, బచ్చలికూర, పాలకూరలో లభించే డైటరీ నైట్రేట్‌పై చేసిన తాజా పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఓర్పు, అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుందని వెల్లడైంది.

Beetroot Benefits: బీట్‌రూట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ రోగులకు దివ్యఔషధమే..
Beetroot For Health

Updated on: Apr 13, 2023 | 3:00 PM

బలమైన కండరాలు శారీరక దృఢత్వానికి చాలా అవసరం. కండరాలు కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తాయి. అయితే బీట్‌రూట్ రసం మీ కండరాల బలాన్ని మీ హృదయ ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీట్‌రూట్, బచ్చలికూర, పాలకూరలో లభించే డైటరీ నైట్రేట్‌పై చేసిన తాజా పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఓర్పు, అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుందని వెల్లడైంది. ముఖ్యంగా బీట్‌రూట్ రసాన్నివినియోగిస్తే డైటరీ నైట్రేట్ సప్లిమెంటేషన్‌తో వ్యాయామ పనితీరులో గణనీయమైన మెరుగుదల ఉంటుందని నిపుణులు నివేదిస్తున్నారు. ఇలా తీసుకున్న వారిలో కండరాల బలం ఏడు శాతం పెరిగినట్లు కనుగొన్నారు. కండరాలు నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చడం ద్వారా సంకోచించే సామర్థ్యం మెరుగు అవుతుంది. ఈ విషయం కచ్చితంగా గుండె జబ్బులతో బాధపడేవారికి ఒక వరంలాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శిక్షణ పొందిన అథ్లెట్లు, చురుకైన వ్యక్తులలో డైటరీ నైట్రేట్ పనితీరును పెంచుతుంది.

బచ్చలికూర, ముల్లంగి, టమోటా రసం, క్యారెట్ రసం, ఇతర ఆకు కూరల్లో కూడా నైట్రేట్-రిచ్ ఎంపికలు ఉంటాయి. ముఖ్యంగా బీట్‌రూట్‌లో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నైట్రేట్ రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 2015లో జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సాధారణంగా దుంపల్లోఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. బీట్‌రూట్‌లో భారీగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల రక్తప్రవాహంలోకి గ్లూకోజ్ విడుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే ఇందులో ఉండే మాంగనీస్ ఇన్సులిన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది. బీట్‌రూట్‌లో అధిక స్థాయల్లో విటమిన్లు ఏ,కే వంటివి అధికంగా ఉంటాయి. అయితే డైటరీ నైట్రేట్‌పై అధ్యయనాలు వేరియబుల్ ఫలితాలను అందించాయి. కొన్ని ముఖ్యమైన మెరుగుదలను నివేదించినా, మరికొన్ని ప్రభావాలను కనుగొనలేదు.అయితే అథ్లెట్లు, చురుకైన వ్యక్తులలో వ్యాయామ పనితీరును పెంచడానికి డైటరీ నైట్రేట్ సప్లిమెంటేషన్ ఒక విలువైన సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయం. అయితే ఇదే సమయంలో హానికరమైన నైట్రోసమైన్‌ల నిర్మాణం వంటి అధిక నైట్రేట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీట్‌రూట్‌ను కూడా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..