
కొన్నిసార్లు మనం ఇష్టపడి కొనుక్కున్న జీన్స్ ప్యాంట్ నడుము భాగంలో లూజ్ అవుతుంటుంది. దీనికోసం టైలర్ వద్దకు వెళ్లకుండానే ఇంట్లోనే జీన్స్‌ను పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌గా మార్చుకునే కొన్ని సులువైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సింపుల్ ట్రిక్స్ దర్జీ ఖర్చును, మీ సమయాన్ని ఆదా చేస్తాయి. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళ్దాం..
జీన్స్ ప్యాంట్ డెనిమ్ క్లాత్‌తో తయారవుతుంది. డెనిమ్ వేడి తగిలితే కొద్దిగా కుంచించుకుపోయే (Shrink) గుణాన్ని కలిగి ఉంటుంది. మీ జీన్స్ లూజ్ అయితే, దానిని వాషింగ్ మెషీన్‌లో వేసి అత్యంత వేడి నీటితో (Hot Water) ఉతకాలి. ఆ తర్వాత మెషీన్ డ్రైయర్‌లో పెట్టి హై హీట్ మోడ్‌లో ఆరబెట్టాలి. ఈ వేడి వల్ల జీన్స్ నూలు పోగులు దగ్గరకు చేరి ప్యాంట్ టైట్‌గా మారుతుంది. అయితే, దీనికి ఎలాంటి ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ వాడకూడదు.
ఇది క్షణాల్లో అయిపోయే ఇన్‌స్టంట్ ట్రిక్. మీ జీన్స్ ప్యాంట్ ముందు ఉండే బటన్‌ను నేరుగా కాజాలో పెట్టడానికి బదులు.. మొదట ఆ బటన్‌ను దాని పక్కనే ఉండే బెల్ట్ లూప్ (బెల్ట్ పెట్టుకునే రంధ్రం) గుండా పోనిచ్చి, ఆపై కాజాలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల నడుము భాగం దాదాపు ఒకటి లేదా రెండు అంగుళాలు టైట్ అవుతుంది.
ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో ఇన్‌స్టంట్ జీన్స్ బటన్స్ సులభంగా దొరుకుతున్నాయి. ఇవి చూడటానికి నట్ అండ్ బోల్ట్ లాగా ఉంటాయి. జీన్స్ నడుము భాగంలో మీకు కావలసినంత మేర క్లాత్‌ను మడతపెట్టి, అక్కడ ఈ పిన్‌ను గుచ్చడం ద్వారా కొత్త బటన్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్యాంట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌లోకి వస్తుంది.
జీన్స్ వెనుక భాగంలో నడుము పట్టీ లోపలి వైపు చిన్న కట్ చేసి, అందులో నుండి ఒక సేఫ్టీ పిన్ సహాయంతో ఎలాస్టిక్ బ్యాండ్‌ను దూర్చాలి. ఆ ఎలాస్టిక్‌ను లాగి రెండు చివరలను కుట్టేయడం వల్ల ప్యాంట్ వెనుక భాగం దగ్గరకు కుంచించుకుపోయి, నడుముకు చక్కగా కుదురుతుంది. ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి మీ పాత లేదా లూజ్ జీన్స్ ప్యాంట్లను మళ్లీ కొత్తవాటిలా మీకు నచ్చిన ఫిట్టింగ్‌లో ధరించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..