Lionel Messi Diet Plan: మెస్సీ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటి? అస్సలు ఏం తింటాడు? ఎలాంటి వ్యాయామం చేస్తాడు?

| Edited By: Anil kumar poka

Dec 27, 2022 | 12:17 PM

ఆటాడే సమయంలో మెస్సీ వేగం, కచ్చితత్వం, డ్రిబ్లింగ్ నైపుణ్యాలు క్రీడా అభిమానుల మనస్సు గెలుచుకున్నాయి. ఫుట్ బాల్ ఆటకు అవసరమైన అద్భుతమైన సామర్థ్యం, తక్కువ గురుత్వాకర్షణ వంటివి మెస్సీకే సొంతం. కానీ ఈ ఆటగాడు చిన్నతనం నుంచి అనేక శారీరక అడ్డంకులను ఎదుర్కొన్నాడు.

Lionel Messi Diet Plan: మెస్సీ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటి? అస్సలు ఏం తింటాడు? ఎలాంటి వ్యాయామం చేస్తాడు?
Lionel Messi Fifa World Cup 2022 Trophy
Follow us on

ఫిఫా వరల్డ్ కప్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు లియోనెల్ మెస్సీ. అర్జెంటినాకు చెందిన ఈ ఆటగాడు తన టీం ఫిఫా వరల్డ్ కప్-2022ను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆటాడే సమయంలో మెస్సీ వేగం, కచ్చితత్వం, డ్రిబ్లింగ్ నైపుణ్యాలు క్రీడా అభిమానుల మనస్సు గెలుచుకున్నాయి. ఫుట్ బాల్ ఆటకు అవసరమైన అద్భుతమైన సామర్థ్యం, తక్కువ గురుత్వాకర్షణ వంటివి మెస్సీకే సొంతం. కానీ ఈ ఆటగాడు చిన్నతనం నుంచి అనేక శారీరక అడ్డంకులను ఎదుర్కొన్నాడు. మెస్సీ చాాలా చిన్న వయస్సు నుంచి గ్రోత్ హార్మోన్ల లోపంతో బాధపడుతున్నాడు. ఆరోగ్య విషయంలో ఎన్ని అడ్డుంకులు ఎదురైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లియోనిల్ మెస్సీ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు. అయితే ఈ ఆటగాడి ఫిట్ నెస్, డైట్ ప్లాన్ గురించి ఓ సారి తెలుసుకుందాం. 

వేగం, చురుకుదనానికే ప్రాధాన్యం

మెస్సీ వ్యాయామాలు ప్రధానంగా వేగం, చురుకుదనానికే ప్రాధాన్యతనిస్తూ సాగుతాయి. మెస్సీ వర్క్ అవుట్ లు డైనమిక్ గా ఉంటాయి. వేగం, సమతుల్యతలను నిర్మించడంలో దృష్టి పెడతాయి. ప్రాథమిక కదలికల కోసం లంగ్స్, పిల్లర్ బ్రిడ్జి-ఫ్రంట్, హోమ్ స్ట్రింగ్ స్ట్రెచ్ లు, స్కిపింగ్ రోప్స్, డిఫరెంట్ యాక్సిలరేషన్ డ్రిల్స్, హార్డిల్ హప్స్, స్క్విట్ స్క్వాట్ లు వంటి వ్యాయామాలు చేస్తాడు. ఈ వ్యాయామాల వల్ల  తన కాలి కండరాలు బలోపేతం అవుతాయి.

ఆహార అలవాట్లు

ఆహార అలవాట్ల విషయానికి వస్తే మెస్సీ ముఖ్యంగా నీరు అధికంగా తాగుతాడు. అతని ఆహారంలో కచ్చితంగా తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, గింజలు వంటివి ఉంటాయి. సూప్ లు, బ్రౌన్ రైస్, ట్యూనా ఫిష్ ను ఇష్టంగా తింటాడు. చక్కెర పదార్థలు, అలాగే వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉంటాడు. మెస్సీకు చాలా ఇష్టమైన ఆహారం రూట్ వెజ్జీ చికెన్. ఇది అత్యంత పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లతో ఉండే ఆహారం. 

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం