Side Effects Of Lemon: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రోటిన్లు ఉన్న ఆహారంతోపాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏదైనా అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందుకే ఎలాంటి ఆహారాన్నైనా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాల్లో నిమ్మకాయ ఒకటి.. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ప్రజలు దీన్ని సలాడ్‌లో, ఆహారంతోపాటు స్నాక్స్ లో తీసుకుంటారు. దీంతోపాటు నిమ్మరసం కూడా చేసుకోని తాగుతారు. చాలా పదార్థాల్లో నిమ్మరసాన్ని వినియోగిస్తారు. అయితే.. దీన్ని సరైన పరిమాణంలో తింటే, అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నిమ్మకాయను అధికంగా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పొత్తికడుపు నొప్పి: ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు వస్తాయని.. దీంతోపాటు జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది.
డీహైడ్రేషన్ సమస్య రావొచ్చు: ఎక్కువగా నిమ్మకాయను ఉపయోగిస్తే అది తరుచూ బాత్రూమ్‌కు వెళ్లేలా చేస్తుంది. ఇది మన అంతర్గత శరీరానికి హాని కలిగిస్తుంది. దీనివల్ల అలసట, నీరసం వస్తుంది.
పంటి నొప్పి: నిమ్మకాయ ఆమ్లత్వంతో ఉంటుంది. ఇది దంతాలలో మంటను కలిగిస్తుంది. ఇలానే ఎక్కువగా తీసుకుంటే.. ఈ సమస్య మరింత పెరిగి దంతాలలోని ఎనామిల్ కూడా దెబ్బతింటుంది. ఇప్పటికే ఇలాంటి సమస్య ఉంటే.. నిమ్మరసం తీసుకోవడం మానేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..