
వేసవి సెలవులు ముగిసిపోవడానికి మరికొద్ది రోజులు సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ పిల్లలకు స్కూలుకు వెళ్లే ముందు ఓ చక్కటి తీపి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే మీరు మామిడి పండ్లతో చేసే ఐస్ క్రీమ్ ను ఇవ్వడం ద్వారా వాళ్లను సర్ ప్రైజ్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామిడి ఫ్లేవర్ తో చేసిన ఐస్క్రీమ్ లో మార్కెట్లో మనకు ఎన్నో లభిస్తూ ఉంటాయి. కానీ అవి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అంటే మామిడి ఫ్లేవర్ తో ఉన్న ఆ ఐస్ క్రీం లలో అసలైన మామిడిపండు రసం ఉండదు అని చెబుతుంటారు. కేవలం మామిడిపండు రుచి వచ్చేలా కొన్ని రసాయనాలను వాడుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు అసలైన మామిడి పండుతో చేసిన ఐస్ క్రీమ్ తినాలని ఉందా. అయితే ఇంట్లోనే ఎంచక్కా మీరు ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ కలిసి తినవచ్చు.
మామిడిపండు ఐస్ క్రీమ్ కోసం ముందుగా బాగా పండిన బంగినపల్లి మామిడి పండ్లను తీసుకోవాలి. వాటి తొక్కను వలిచి ముక్కలుగా చేసుకోవాలి. అలా సుమారు మూడు కాయల వరకు తీసుకోవచ్చు. చిన్నవి అయితే ఐదు కాయల వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఆ మామిడిపండు ముక్కలను మిక్సీలో వేసి గుజ్జు వచ్చేలా తిప్పాలి. అనంతరం అందులో కొద్దిగా పాలను పోసుకొని మిక్స్ చేయాల్సి ఉంటుంది.
మార్కెట్లో లభించే కండెన్స్డ్ మిల్క్ వేడి చేస్తూ అందులో కొద్దిగా నీరు కలుపుకోవాలి. బేకరీలో లభించే చైనా గ్రాస్ అనే ఓ పదార్థాన్ని ఆ మిశ్రమంలో కలపాలి. అలాగే పిస్తా బాదం జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు. ఇక ఈ మిశ్రమంలోకి కొద్దిగా యాలకులను కూడా కలుపుకోవాలి. చివరకు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి చల్లార్చుకోవాలి. అనంతరం ముందుగా చేసి పెట్టుకున్న మ్యాంగో గుజ్జును ఇందులో కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బ్లెండర్ తో చిక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో మిశ్రమాన్ని పోసి డిప్ ఫ్రీజర్ లో గడ్డకట్టే వరకు ఉంచాలి.
మిశ్రమం గడ్డ కట్టిన తర్వాత. బయటకు తీసి దాన్ని కప్పుల్లో వేసుకొని కొద్దిగా మామిడిపండు ముక్కలు మెత్తగా దంచిన బాదంపప్పు చల్లుకొని సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ రుచి అదిరిపోతుందనే చెప్పవచ్చు.
మ్యాంగో లస్సి ఎలా తయారు చేసుకోవాలి:
వేసవికాలంలో సాధారణ లస్సీ బోర్ కొట్టేసిందా.. అయితే మ్యాంగో లస్సి చేసుకొని తాగి చూడండి మీరు ఈ రుచికి బానిస అవడం ఖాయం. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మామిడిపండు ముక్కలను తీసుకొని వాటిని గుజ్జులా చేసుకోవాలి. అనంతరం అందులో సమపాళ్లల్లో పెరుగు వేసుకొని పంచదార కలిపి బ్లెండర్ తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. . నురగలు వచ్చేంతగా బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు రుచికరమైన మ్యాంగో లస్సి తయారవుతుంది. వేడివేడి వేసవిలో చల్లటి మ్యాంగో లస్సీ తాగితే ఆ హాయే వేరు.
మరిన్ని లైైఫ్ స్టైల్ వార్తల కోసం…