AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Flour Scrub: బియ్యం పిండితో ఆ సమస్యలన్ని మటుమాయం.. ఎలా ఉపయోగించాలంటే..

ముఖం, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు అనేక పద్ధతులను అనుసరిస్తుంటాం. వాటిలో ఎక్స్‏ఫోలియేషన్. దీని ద్వారా చర్మాన్ని స్క్రబ్బింగ్ చేస్తుంటాం.

Rice Flour Scrub: బియ్యం పిండితో ఆ సమస్యలన్ని మటుమాయం.. ఎలా ఉపయోగించాలంటే..
Flour
Rajitha Chanti
|

Updated on: Apr 25, 2022 | 12:24 PM

Share

ముఖం, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు అనేక పద్ధతులను అనుసరిస్తుంటాం. వాటిలో ఎక్స్‏ఫోలియేషన్. దీని ద్వారా చర్మాన్ని స్క్రబ్బింగ్ చేస్తుంటాం. సాధారణంగా చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయడం వలన చర్మంలోని మృతకణాలు తొలగిపోయి మెరుగ్గా ఉంటుంది. దీంతోపాటు స్క్రబ్బింగ్ చేయడం వలన చర్మం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చేయడం వలన చర్మంపై పేరుకుపోయిన మురికి బయటకు వెళ్లడమే కాకుండా.. చర్మం మరింత నిగారింపుగా కనిపిస్తుంది. అయితే చాలా మంది బియ్యంపిండితో ఒక్కసారి స్క్రబ్బింగ్ చేసి మళ్లీ చాలా నెలల వరకు చేయకుండా వదిలేస్తారు. దీంతో చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. అలాగే స్క్రబ్బింగ్ చేయకపోవడం వలన చర్మం నిర్జీవంగా మారిపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చర్మం స్క్రబ్బింగ్ చేయకపోవడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

దుమ్ము, ధూళీ, చెమట వలన చర్మంపై ఉండే రంధ్రాలలో ధూలీ పేరుకుపోతుంది. దీంత క్రమంగా మొటిమలు ఏర్పడతాయి. దీంతో ముఖ సున్నితత్వం దెబ్బతింటుంది. అందుకే తరచూ ముఖాన్ని, చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయడం చాలా ముఖ్యం. అయితే మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ కంటే ఇంట్లోనే బియ్యం పిండితో స్క్రబ్బింగ్ చేసుకోవడం చాలా మంచిది. అయితే బియ్యంపిండితోపాటు.. కొన్నిరకాల పదార్థాలను కలపడం వలన చర్మాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవచ్చు.

బియ్యంపిండి, తేనె.. నడుము భాగంలో ఉన్న మొటిమలు తొలగిపోవాలంటే బియ్యంపిండిలో కొద్దిగా తేనె కలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని నడుము, చేతులు, కాళ్లకు స్క్రబ్బింగ్ చేయాలి. బియ్యంపిండి చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తే తేనె.. చర్మాన్ని మృదువుగా చేయడానికి పనిచేస్తుంది. తేనెలో ఉండే పోషకాలు చర్మానికి పోషణను అందిస్తాయి. వారానికి కనీసం రెండుసార్లు బాడీ స్క్రబ్ చేయడం మంచిది.

బియ్యం పిండి, బంగాళదుంపలు.. బంగాళదుంపల రసాన్ని బియ్యంపిండిలో కలిపి తీసుకుంటే రెట్టింపు లాభాలు ఉన్నాయి. ఒక గిన్నెలో రెండు చెంచాల బియ్యంపిండి తీసుకుని అందులో మూడు చెంచాల బంగాళదుంప రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులు, పాదాలు, నడుముకు స్క్రబ్బింగ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి కూడా అప్లై చేయవచ్చు. బంగాళదుంప రసం చర్మంపై టాన్ ను తొలగిస్తుంది.

బియ్యంపిండి, కలబంద.. కలబంద గుజ్జులో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. బియ్యంపిండి, కలబందతో చేసిన స్క్రబ్ చర్మాన్ని మెరిసేలా.. ఆరోగ్యంగా ఉంచుతుంది. బియ్యంపిండిలో రెండు చెంచాల కలబంద గుజ్జును మిక్స్ చేసి శరీరానికి స్క్రబ్ చేయాలి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత చర్మంపై కాసేపు అలాగే వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాత శరీరాన్ని మయిశ్చరైజల్ చేయడం మాత్రం తప్పనిసరి.

గమనిక: – ఈ కథనం కేవలం చర్మ నిపుణుల అభిప్రాయాలు, సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనీనీ టీవీ 9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read: Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ ?..

Ram Charan: బాబాయ్‏తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..

Viral Video: బాబోయ్.. ఎక్కడా చోటు లేనట్టు అమ్మాయి జుట్టులో చిక్కుకున్న పాము.. ఒళ్లుగగుర్బొడిచే వీడియో…