
ప్రతి వంటలోనూ చివరకు తప్పనిసరిగా వేసేది కొత్తిమీర. కొత్తిమీర ఆకు ఆహారం రుచి, వాసనను పెంచుతుంది. కేవలం రుచి, సువాసన మాత్రమే కాదు..ఆరోగ్యానికి, శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది కొత్తిమీర. ఆయుర్వేదంలో కొత్తిమీరను ఔషధంగా పరిగణిస్తారు. కొత్తిమీర ఆకులలో విటమిన్ సి,విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు మొక్కల ఆధారిత సమ్మేళనాలు మీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. దృష్టిని మెరుగుపరుస్తుంది. ధనియాలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటీనాకు పోషణనిస్తుంది. తద్వారా కళ్ళనుతేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
కొత్తిమీర మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకులలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. కొత్తిమీరలో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు. కొత్తిమీర తినడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధమనే చెప్పాలి.
కొత్తిమీరను వినియోగించడం చాలా సులువు. నేరుగా ఆకులు తినొచ్చు. ప్రతి కూరపై నుంచి జల్లుకోవచ్చు. కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు. మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. రసంగా తాగొచ్చు. గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం వాటి నుంచి ఉపశమనం ఇస్తుంది. కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..