Lung Cancer: ధూమపానం చేయని వారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడుతున్నారు..! WHO హెచ్చరిక..!
ఇది పరివర్తన చెందుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. అధిక స్థాయిలో అయోనైజింగ్ రేడియేషన్‌కు గురైన వ్యక్తులు, న్యూక్లియర్ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్. అందులోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ రకం క్యాన్సర్ గా మారింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు పొగాకు పొగ ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. అయితే పొగతాగని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రేటు పెరుగుతోందనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే కళ్లు తిరుగుతాయి. నిరంతరం సిగరెట్ తాగే వ్యక్తులు చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వారు మృత్యువు ఆహ్వానిస్తున్నట్టేనని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ధూమపానం చేయని చాలా మంది వ్యక్తులు ధూమపానం చేసే వ్యక్తులకు దగ్గరగా ఉంటున్నారు. మీరు స్మోకింగ్ చేస్తున్న వారి దగ్గర నిలబడితే, మీకు తెలియకుండానే సెకండ్‌హ్యాండ్ పొగ పీల్చడం జరుగుతుంది. ఈ పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వాయు కాలుష్యం కూడా ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 1.8 మిలియన్ల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్నారు…వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది. 2020లో లాన్సెట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, 2019లో వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో 17 లక్షల మంది మరణించారు.
జన్యు ఉత్పరివర్తనలు కుటుంబ సభ్యులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులతో ఉన్న కుటుంబాలలో, ఇతర కుటుంబ సభ్యులు ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.
రేడియేషన్ ఎక్స్పోజర్ ఊపిరితిత్తుల కణాలలో DNA దెబ్బతింటుంది. ఇది పరివర్తన చెందుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. అధిక స్థాయిలో అయోనైజింగ్ రేడియేషన్‌కు గురైన వ్యక్తులు, న్యూక్లియర్ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..