
ఉలవలు ఎంతో ఆరోగ్యకరం. వీటిని క్రమంగా తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల పోషకాహార లోపం సమస్యను అధిగమించవచ్చు. శరీరంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. ఉలవలు తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తుంది. ఫలితంగా మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
మన ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉలవలలో పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, జింక్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో యాంటీ-అడిపోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-హైపర్గ్లైసీమిక్, యాంటీ-హైపర్ కొలెస్ట్రాలెమిక్ లక్షణాలు ఉన్నాయి. చలికాలంలో ఉలువలు తీసుకుంటే… శ్వాస సమస్యలు తగ్గుతాయి. కఫం సమస్యలు కూడా రావు.దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉలవలు ఆకలిని పెంచుతాయి. పిల్లలకు ఉలవులు పెడితే మంచిది.
ఉలువలను డైట్ లో చేర్చుకోవటం వల్ల మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉలవల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఉలవలు జీర్ణ ప్రక్రియను మెరుగుచేస్తాయి. మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణవ్యవస్థ సమస్యలను నివరిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉలవలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ఔషదంలా ఉపయోగపడతాయి.
(NOTE: ఇందులోని విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..