అలర్ట్.. బహిరంగంగా ధూమపానం చేస్తే రూ.13,000 ఫైన్ కట్టాల్సిందే…! ఆరోగ్య మంత్రి హెచ్చరిక..
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా, బీచ్‌లు, పార్కులు, బస్ స్టేషన్లు, ఆట స్థలాలు వంటి పిల్లలు తరచుగా వచ్చే ప్రాంతాలలో ధూమపానాన్ని నిషేధించాలనే డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు 62 శాతం మంది ప్రజలు ఈ నిషేధాన్ని సమర్థించారు.

యూరప్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన దేశమైన ఫ్రాన్స్‌లో కీలక నియమం అమల్లోకి రానుంది. ఫ్రెంచ్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం పూర్తిగా నిషేధించబడింది. ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే వారికి రూ.13,000 వరకు జరిమానా విధించబడుతుంది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ఆరోగ్య, కుటుంబ మంత్రి కేథరీన్ వాట్రిన్ ప్రకటించారు. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.
జస్ట్ ఇన్: 🇫🇷 ఫ్రాన్స్ బీచ్‌లు, పార్కులు, పాఠశాలల సమీపంలో సహా చాలా ప్రదేశాలలో ఆరు బయట సిగరెట్లు వంటి ధూమపానం చేయటం పూర్తిగా నిషేధించనుంది. ఈ మేరకు ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి కేథరీన్ వౌట్రిన్ గురువారం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. జూలై 1 నుండి ఫ్రాన్స్‌లో పిల్లలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో బహిరంగ ధూమపానం నిషేధించబడుతుందని ప్రకటించారు. ఇందులో బీచ్‌లు, పార్కులు, బస్ స్టాప్‌లు, స్పోర్ట్స్-ప్లే గ్రౌండ్‌లు వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నింటిలో ధూమపానం పూర్తిగా నిషేధించబడుతుంది. అయితే, ఈ కొత్త నియమాలు కేఫ్ టెర్రస్‌కు వర్తించవు. దీనితో పాటు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు కూడా ఈ నిషేధం నుండి మినహాయింపునిచ్చారు.
పిల్లలు ఉన్న చోట పొగాకు వాడకాన్ని నిషేధించాలని కేథరీన్ వాట్రిన్ ఔస్ట్-ఫ్రాన్స్‌తో అన్నారు. మైనర్లను సిగరెట్ పొగ నుండి రక్షించడానికి, ధూమపానంపై కఠినమైన నియంత్రణను ఉంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘిస్తే, వారికి 135 యూరోలు (రూ. 13,000) వరకు జరిమానా విధించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక ప్రజా సర్వేలో 62 శాతం మంది ఫ్రెంచ్ పౌరులు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించడాన్ని సమర్థిస్తున్నారని తేలింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




